*అక్షర మాల గేయాలు*-- *'ఘ' అక్షర గేయం*-- --వురిమళ్ల సునంద,ఖమ్మం--9441815722

 ఘటమంటే తెలుసా చిన్నా!
ఘటమంటే  కుండరా నాన్నా!
కుండలో నీళ్ళు ఎంతో చల్లన
సంఘమంటే తెలుసా కన్నా!
పదుగురు కలిస్తే  సంఘం నాన్నా!
"సంఘం శరణం గచ్ఛామి" అనే మాట విన్నావా చిన్నా!
ఘనత పొందిన బుద్ధుని 
మాటరా నాన్నా! 
మనమంతా సంఘటితంగా  ఉండాలిరా కన్నా!
సమైక్యతతో  మనం ముందుకు సాగాలిరా నాన్నా!