ముగ్గురు బ్రహ్మరాక్షసులు.:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.

 పూర్వం కాశిలో యజ్ఞదత్తుడు అను బ్రాహ్మణుడు ఉండేవాడు.
అతను పుట్టుగుడ్డి. భార్య అందాలరాశి. ఇంత అందమైన  ఆమెకు గుడ్డివాన్ని భర్తగా ఆ దేవుడు ముడి వేసాడు అని ఇరుగు పొరుగు వారు అంటుంటే
యజ్ఞదత్తుడు విని బాధపడేవాడు.
ఆ బాధను గమనించిన అతని భార్య"ఎందుకలా బాధపడతారు అండి. కాశీ విశాలాక్షి కరుణిస్తే తప్పకుండా  మీకు కళ్ళు వస్తాయి.
అని  రోజు ఊరడించేది.
ఒకరోజు భార్యాభర్తలు కాశీకి ప్రయాణం అయ్యారు. అలసిపోయి వారు తోవలో ఓ మర్రిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ మర్రిచెట్టుపై ఉన్న నా ముగ్గురు బ్రహ్మరాక్షసులు వీరిని చూసి" ఓ నరులారా! ఎవరు మీరు? ఇక్కడ ఎందుకు ఉన్నారు"? అనగా నా పేరు యజ్ఞదత్తుడు. నేను పుట్టుగుడ్డివాడిని. ఈమె నా భార్య. కాశీ విశాలాక్షి అమ్మ గారు నాకు చూపు ప్రసాదిస్తారని ఆశతో ఆ తల్లిని పూజించుటకు కాశీ వెళ్తున్నాం. అలసి ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాం"అన్నాడు.
         అప్పుడు ఆ ముగ్గురు రాక్షసులు" మిమ్మల్ని చూసినంతనే మాకు మా పూర్వజన్మ స్మృతి కలిగింది. మీరు మామూలు మనుషులు కారు. ఆ విశాల లక్షమ్మ దీవెనలు ఉన్నవారు. కాబట్టి మాకు పూర్వ జన్మ స్మృతి వచ్చినది. మీ వల్లనే మా పాపాలు తొలగిపోయి యధా రీతిగా మా పూర్వ రూపాలను పొందగలము
.
          దయచేసి మా పూర్వజన్మ వృత్తాంతం విని మమ్ముల శాపవిముక్తుల్ని చేయండి."గతంలో లో మేము ముగ్గురం అన్నదమ్ములం. దొంగతనాలు దోపిడీలు చేసి హత్యలు కూడా చేసి ఎంతో పాప మూటగట్టుకున్నం. కాళీ మాత ఆలయంలో ఒక బోయ స్త్రీతో సృష్టికార్యం నిర్వహించాం. కాళీ మాత చూసి ఆగ్రహించి మమ్ముల బ్రహ్మ రాక్షసులు కమ్మని శపించింది. శాప విమోచనకై ప్రార్థించగా"పుట్టుగుడ్డి బ్రాహ్మణుని వళ్ళ శాప విమోచనం అవుతుందని చెప్పింది. ఇప్పుడు మీరు వచ్చారు. మాకు శాపవిమోచనం కలిగించండి అని కోరగా యజ్ఞదత్తుడు "మీరు  భయపడవలసిన పనిలేదు. మేము ఆ విశాల క్షమను దర్శించుకునేందుకు కాశీకి పోతున్నాం. మీ ముగ్గురు మాతో రండి అక్కడ కాశీలో అమ్మవారి పూజ చేసి మీకు పాప ప్రక్షాళన మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఉపదేశ అనంతరం గోదావరిలో మీరు స్నానమాచరిస్తే మీ పూర్వ రూపాలు మీకు వస్తాయి "అని చెప్పాడు.
      సరే వెళ్దాం పదండి అంటూ అయిదుగురు కాశీకి ప్రయాణమై వెళ్లారు. అమ్మవారి ఆలయంలో యజ్దత్తుడు పూజ చేసి"అముకానాం బ్రహ్మ రాక్షసత్వం నివారణార్థం అస్యయాం గోదావరేణ్య స్నాన
 మహంకరిష్యే"అని మంత్రం చదవగానే ఆ బ్రహ్మ రాక్షసుల పూర్వ రూపాలు వారి కొచ్చాయి.
         పూర్వ రూపాలు పొందిన ఆ ముగ్గురు గంధర్వులు"మాతా! ఈ బ్రాహ్మణుని మంత్రోపదేశం చే మా నిజరూపాలు మాకు దక్కినవి. పరోపకారార్ధం ఇదం శరీరం అన్నట్లు వీరు మాకు సహాయం చేసినారు. ఇట్టి వారిని మీరు  కనికరించి ఈ బ్రాహ్మణుడికి చూపు ప్రసాదించు"అని ఆ
 దేవిని వేడుకున్నారు. వారి కోరిక మన్నించి ఆ విశాల లక్షమ్మ యజ్ఞదత్తుడు కి చూపు ప్రసాదించింది. చూపు వచ్చిన భర్తను చూసి యజ్ఞదత్తుడు భార్య ఎంతో సంతోషించింది