అర్ధనారీశ్వరి. (బాలల కథ):-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-సెల్ నెంబర్.9491387977.-నాగర్ కర్నూలు జిల్లా.

 ఒక నాడు కైలాస పర్వత శిఖరం పై మహాశివుడు ప్రథమ గణాలతోను, సకల దేవతల తోనూ కొలువై తన ప్రియ పార్వతీ దేవిచే సకల సపర్యలు చేయించుకున్న వాడై అందరిచే పూజలందుకొనుచుండగా అప్సరసలు అందరూ నాట్య మాడు చుండిరి. అప్పుడు అప్సరసలు కు పోటీగా బృంగి అను శివుని యొక్క ద్వారపాలకుడు కూడా వికట నాట్యం చేస్తూ అందరిని నవ్వించాడు. మహాశివుడు బృంగి నాట్యము మెచ్చుకొని అతన్ని అనుగ్రహించాడు. అమితానందంతో బృంగి పొంగిపోయి పార్వతీ దేవిని వేరుచేసి  కేవలము ఒక్క శివునికి ప్రదక్షణ చేశాడు.ప్రక్కనేఉన్న నన్నువదలి మీకు మాత్రమే ప్రదక్షణ చేయడానికి కారణం ఏమిటని తన పతిని ప్రశ్నించింది పార్వతి. అందుకు శివుడు"భవానీ!
యోగులకు నీవల్ల ప్రయోజనం ఏముంది? అందువల్లనే బృంగి నాకు మాత్రమే ప్రదక్షిణ చేశాడని శివుడు చెప్పాడు.
        మహా శివుని సమాధానంతో తృప్తి చెందని పార్వతీ దేవి తన పతిపై అలిగి కోపంతో దేవతలందరూ వారించిన వినక వెంటనే కైలాసం వదిలి కేదార మను క్షేత్రమునకు వెళ్ళిపోయెను.
అక్కడ గౌతమమునిచే ఉపదేశాన్ని పొంది ఘోర తపము కేదారేశ్వర స్వామి ని పూజిస్తూ చేసెను. అంతట శివుడు పార్వతి తపస్సు ని మెచ్చుకొని వెంటనే సాక్షాత్కరించెను. అప్పుడు పార్వతి తన భర్త అయిన శివుని దేహంలోని అర్థ శరీరాన్ని పొందేలా వరం ఇవ్వమని కేదారేశ్వర స్వామి ని కోరెను. ఆమె కోర్కె ప్రకారం గా కేదారేశ్వర స్వామి వెంటనే అలా వరాన్ని ఇవ్వడం వల్ల ఆనాటినుండి పార్వతి అర్ధనారీశ్వరి అయ్యింది. శివుడు జ్యోతిర్లింగము గా ఉన్నప్పుడు గతంలో విష్ణు కోర్కె మేర ప్రసన్నుడై వరము కోరుకొమ్మనగా విష్ణు నేనే సర్వస్వామ్యుడను, విశ్వవ్యాప్తి ధరుడను, నన్ను మించిన వారు లేరని గర్వముతో నీవు నాకు సేవ చేయుము అని కోరెను. ఆ దోషము చేత విష్ణువే శివునకు అర్ధనారి గా జన్మించెను. అప్పటినుండి  పార్వతీదేవికి అర్ధనారీశ్వరి మాత అని పేరు వచ్చేను.

కామెంట్‌లు