దగాపడ్డ తెలంగాణ తమ్ముడా......!:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్ ర్ 9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
పూర్తిగా దగాపడ్డ తెలంగాణ తమ్ముడా
స్పూర్తి లేక ఎగాదిగా చూస్తావింకేందిరా
నిన్ను నన్ను కన్నది ఈ తెలంగాణ తల్లి భారతి
మిన్ను మన్ను ఏకమైనా  వెలిగిద్దాం మళ్లీ హారతి

పోరు బాట బట్టి విజయ ఢంక
 మనం కొట్టినం
అలుపు సొలుపు లేకుండా రాష్ట్రాన్ని చుట్టినాం
ఘన తెలంగాణ తెగువ బలం చూపిస్తిమిగా
మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనం సాధిస్తేమిగా

ఈ తెలంగాణ మన కన్నతల్లి తెలుసుకో నీవు చెల్లి
తెలుగు వెలుగులతో ప్రకాశించు మన పున్నమి జాబిల్లి
మనం జతకట్టి సాధించిన ఈ ఘన
 తెలంగాణ
శతకోటి రత్నాలను పులుముకున్న మన తెలుగు జాన