మా పాటల బాలు:--గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
బాలు బాలు బాలు నా కలలోన నా బాలు
తాను పాటలు పాడి చేసెనుగా తన చేవ్రాలు
నాకు గానాంమృతమును వంచెను  నా బాలు
ఆ సంగీత సామ్రాట్ కు నా వేలవేల నా జేజేలు !

బాలు బాలు పాటలు పాడే నా మంచి బాలు
ఆ బాలు మోమున లేనేలేవు ఏలాంటి కోపాలు
పాటల పల్లకి ఎక్కి ఆటల అల్లరి వల్లరికే తాచిక్కి
శ్రోతల మదిలో వెలిగిస్తాడు పాటల ప్రమిదల దీపాలు !

బాలు బాలు బాలు మా పాటలు బాగా పాడే బాలు
మా బాలు ముఖః చూపులు ముద్దమందారాలు
అవి నవ్వుల పువ్వుల  గువ్వలను  దవ్వున ఎగిరే స్థాయి
రివ్వున  జువ్వున మన మనసు పువ్వును కరిగిస్తాయి !

బాలు బాలు బాలు పాటలు పాడే మా బాలు
మా బాలు పాడిన పాటలు వేలకు వేలు
పరవశించిపోయే విన్న మా శ్రోతల ప్రాణాలు
చెప్పినారు వారు వారికి వేలవేల జేజేలు !

బాలు బాలు బాలు పాటలు పాడే మా బాలు
ఎంచుకొని పంచుకున్నడు శ్రోతల ముద్దు మురిపాలు
సదా తాను సప్తస్వరాల సరిగమ లందు తేలు
యధా తధా గానామృతమునే తాను గ్రోలు !

బాలు బాలు బాలు పాటలు పాడే మా బాలు
ఎక్కడ ఉన్న మేం వేస్తాం ఆయన మెడలో బంతిపూలు
వందనాలు అర్పిస్తాం సుమ చందనాలు కురిపిస్తాం
జయం తుల జరిపిస్తాం విజయవంతం మేం చేస్తాం !