పుణ్యఫలం:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-సెల్ నెంబర్.9491387977.-నాగర్ కర్నూలు జిల్లా.
 
పూర్వం తక్షశిల నగర మందు సత్యవ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. భార్య సత్యవతి. కొడుకు గుణనిధి. అతడు బ్రాహ్మణుడై ఉండి కూడా దుర్వ్యసనాలకు లోనై నాడు.
నిత్యం మద్యం సేవిస్తూ భార్య ఎంత చెప్పినా వినుకొండ పరస్త్రీలతో సుఖించేవాడు.
అతని తిరుగుల్లను గమనించిన అతని తండ్రి ఓ నాడు కొడుకుతో
"సత్యవ్రతా! నీ తిరుగుళ్ళు మానుకో నాయనా! బ్రాహ్మణుల మైన మనకు మన వంశానికి ఇవి చెడ్డపేరు తెస్తాయి."అని హితబోధ చేశాడు. అయినా అతనిలో మార్పు రాలేదు.
         అతను ఒక నాడు రాత్రి పీకలదాకా తాగి భార్యతో మాంసం వండి పెట్టమని వేధించసాగాడు. భార్య ససేమిరా ఒప్పుకోలేదు. అందువల్ల కోపోద్రిక్తుడై భార్యను కొట్టబోయి వెలుగుతున్న లాంతరు కు తగిలిమంటల్లో పడి ఒళ్ళు కాల్చుకున్నాడు.మంట బాధ భరించలేక భార్యను ఆస్పత్రికి తీసుకెళ్ల మన్నాడు.
నేనొక్కదాన్ని నిన్నెలా తీసుకెళ్లాగలను అంది భార్య.
పక్కింటి నారాయణను పిలువే అనగా నువ్వే పిలుచుకో అని తెగేసి చెప్పింది భార్య.
భార్య మాటలు విన్న సత్యవ్రతుడు
గట్టిగా నారాయణ నారాయణ అంటూ పిలుస్తూనే కాళ్లు చేతులు కొట్టుకుంటూ తండ్లాడుతూ తన ప్రాణాలు విడిచాడు. పాప బ్రష్టుడైన సత్యవ్రతున్ని యమభటులు నరకానికి తీసుకువెళ్లే టందుకు ఎత్నించగ విమానంలో వచ్చిన వైకుంఠం దూతలు"యమభటులారా!ఇతనిని మేము స్వర్గానికి తీసుక పోవుటకు వచ్చితిమి."అని చెప్పి
సత్యవ్రతున్ని తీసుకొని పోవుచుండగా యమదూతలు"అయ్యా! ఇతడు చాలా దుర్మార్గుడు. ఇతనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము వచ్చి ఉంటిమి. మీరు వదలండి అనగా ఆ దేవదూతలు
ఈ సత్యవ్రతుడు తాగుబోతు కావచ్చు, పాపాత్ముడు కావచ్చు కానీ అవసాన దశలో నారాయణ నారాయణ అంటూ తనకు తెలియకుండానే ఆ శ్రీమన్నారాయణుని బిగ్గరగా కేకలేసి పిలుస్తూ తలుచుకున్నాడు.
        చనిపోవు సమయమున తెలిసిగాని తెలియక గాని" శివ" అని శివుని గాని "నారాయణ"అని హరిని గాని స్మరించిన వారు, హరి నామ స్మరణ చెవిన సోకిన వారు పుణ్యాత్ములు ఈ సత్యవ్రతుడు ఎంతటి పాపములు ఆచరించి నప్పటికీ చనిపోవు సమయమున "నారాయణ "అని స్మరిస్తూ చనిపోయినందున మేము ఇతనిని స్వర్గమునకు తీసుకొని కూర్చున్నాము అని పలికిరి.
ఆ దూతల మాటలు విన్న సత్యవ్రతుడు"అయ్యా నా జన్మలో ఎన్నడు శివకేశవుల పూజించుట గాని పుణ్యకార్యములు ఆచరించుట కానీ నే చేసి యుండలేదు. నా తండ్రి మాటలు వినలేదు. నా భార్య మాటలు వినలేదు. కేవలం చావు భయం తో పక్కింటి నారాయణను పిలిచినంత మాత్రాన నన్ను నరకము నుండి తప్పించి విష్ణు లోకమునకు మీరు తీసుకొని పోవుచున్నారు. నా తల్లిదండ్రుల పుణ్య ఫలము వలన నాకిప్పుడు స్వర్గము ప్రార్థించినది. అని పలికి సత్యవ్రతుడు దేవలోకమునకు విమానము ఎక్కి ఆనందముతో స్వర్గమునకు పోయెను.