మా వీరాంజనేయుడు:--గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి..సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
ఆంజనేయుడు ఆంజనేయుడు ఆంజనేయుడు
పబ్బతి ఆంజనేయుడు మా సుప్రజాంజనేయుడు
అభయాంజనేయుడు మా వైభవాంజనేయుడు
జయుడు విజయుడు అజేయుడు మా విశ్వాంజనేయుడు !

ఆంజనేయుడు ఆంజనేయుడు ఆంజనేయుడు
శ్రీరామాంజనేయుడు మా వీరాంజనేయుడు
అందరు పూజించే ధ్యానించే సీతారామాంజనేయుడు
మనకు ముక్తిని అందించే మన భక్తాంజనేయుడు!

ఆ శ్రీరాముని నమ్మకంగా నమ్ముకున్న బంటు
జై శ్రీరాం నామస్మరణ తాను చేసుకుంటూ
తాను అవలీలగ సముద్రాన్ని లంఘించే
శ్రీరాముని మదిలోన ధీమాను కలిగించే

అనంత బలశాలి మన ఆంజనేయుడు
జ్ఞానశాలి విజ్ఞానశీలి ఈ ప్రజ్ఞ ఆంజనేయుడు
రామాజ్ఞను జవదాటని శ్రీరామ భక్తుడు
సప్త సముద్రాల లంగించిన శక్తి యుక్తుడు!

సద్గుణ సంపద శాలి మన ఆంజనేయుడు
బాహుబలధీశాలి ఘణాంజనేయుడు
అవలీలగా సం

జీవ పర్వతాన్ని ఎత్తినవాడు
లీలగా లక్ష్మణుని ప్రాణాలను కాపాడిన రేడు

లంకా నగరాన్ని నిలువునా దహించిన ధీశాలి
రామలక్ష్మణుల భుజాన మోసిన బలశాలి
అట్టి శక్తియుక్తుల మా హనుమకు వందనం 
గట్టి ఆసక్తితో చేద్దాం అంతా అభివందనం !