సేవాలాల్ మహారాజ్ భవిష్యవాణి:-అనువాదకుడు:-రాథోడ్ శ్రావణ్-9491467715పూర్వ అధ్యక్షులుఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా.

 0️⃣1️⃣
ఈ సతీయుగ్ ఛ
ఎర్ బాద్  కలియుగ్ ఆయ
కలియుగేం కళ్ళోళమఛ్చజాయ
మా ఏన్ బెటా భారి వెజాయ
రపియా కటోరో పాణి వక్జాయ 
రపియార్ తేరచణా వకియ మారో రాం ..!
భావార్థము :- ఓ రామా ! ఇది సతియుగము, ఆ తర్వాత కలియుగం వచ్చును, కలియుగంలో అల్లకల్లోలగును, అమ్మకు బిడ్డలు భారమగును,నిళ్ళప్యాకెట్లు అమ్ముడు పోవును, ఒక రూపాయికి పదమూడు శెనగలు అమ్ముడుపోవును.
0️⃣2️⃣
వాణా వాణార్ దఃఖ ఆయ.!
ఘర్, ఘర్, డాక్టర్ ఆయ.!
డాక్టర్ దఃఖెర్ పరక్ కరియ.!
ఓన్ దఃఖ లాబ కొని..! 
బొలతు బొలతు మనక్యా మరీయ.!
భావార్థము  :- రకారకాల రోగాలు రావచ్చు, ఇంటింటికి వైద్యులు రావచ్చు, వైద్యులు రోగాల పరీక్షలు చెయ్యచ్చు, రోగం ఏదో వాళ్ళకు  తెలయక పోవచ్చు, మాట్లాడుతూ, మాట్లాడుతూ మనిషి(రోగి) చనిపోవచ్చు .
0️⃣3️⃣
ఘర్ ఘర్ నాయక్ వియ..!
కాళ,కంఠ,విజ్ఞ ఆయ..!
బాప్ బెటార్ లడాయి వీయ..!
నాయక్ కార్భారి నసాబ్ కరీయ.!
గోర్ గరిబేన్ దాండన్ ఖాయ..!
వుందేర్ సాత్ పిడి నరకేం జాయ..!
భావార్థము :-  ఇంటింటికి నాయకులు కావచ్చు,ఆకాల కష్టవిపత్తులు సంభవించ వచ్చు,ఊరి పెద్దలు పంచాయతీ ‌చేసి పేదప్రజలను దండించి తినొచ్చు, వాళ్ళ వంశము నరకం అనుభవించచ్ఛు.
0️⃣4️⃣
సేవాభాయా కెగోతో మత్ ఖావజో జంగలేర్ మోర్..?
కసాబేన్ మత్ వెచ్చో ఢోర్..?
జంగల్ కా మోర్ ఖానా నహీ
కసాబ్ కొ గయ్యా బెచనా నహీ
ఔరత్కో బాజార్ భెజనానహీ
గోసామాల్ ఖానానహీ
జిందా మరద్ కి ఔరత్ కోయి లేనా నహీ.
భావార్థము :-సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అన్నారు అడవి నెమళ్లలను తినద్దు, గోవులను ఖటికొళ్ళకు  అమ్మవద్దు, ఆడవాళ్ళులను బజారు పంపవద్దు,ఖటికోల్లా మాంసం తినద్దు, బతికి ఉండే మనుషుల పెళ్లాన్ని ఎవ్వరు చెసుకొవద్దు.
0️⃣5️⃣
రండిరో రాజ్ ఆయ.!
పల్కేర్ వాత్ మల్కేంజాయ..!
భాయి,భాయర్ పట్టకొని
బాప్ బెటార్ పట్టకొని
సాసుబొడిర్ పట్టకొని.
భావార్థము :- ఈ ప్రపంచంలో  మహిళ రాజ్యం వచ్చను,చరవాణి గురించి అప్పట్లో అన్నారు క్షణంలోనే సమాచారం అంతటా వ్యాపించవచ్చు, అన్నదమ్ముల, తండ్రికొడుకులు, అత్తకోడళ్ల  కొట్లాటలు జరగవచ్చు.
0️⃣6️⃣
సత్తామాయి జో ఆయ,
ఝుటో సాసో వెజాయ,
సత్య ఆ సత్యవీయ
ధర్మ ఆధర్మవీయ
న్యాయ ఆ న్యాయ, 
బాయి పోరిపర్ అత్యాచార్ వీయ
పాపి కప్టిరో రాజ్ ఆయ
పాపిఘర్ రపియా రడెరడె జాయ
లాంబి ఝాడిన్ గోర్ వస్ జాయ.
భావార్థము :- ఎవరి పరిపాలనా సాగునో వారు అబద్ధము చెప్పిన నిజమగును, ధర్మం అధర్మం అగును, న్యాయం ఆన్యాయం, సత్యం ఆసత్యం అగును, స్త్రీల పై అత్యాచారం జరుగును, పాపిష్టుల కాలం రావచ్చు, వారి ఇంట్లో డబ్బులకు కొదవ ఉండక పోవచ్చు,వీరి పాలనా భరించలేక మనుషులు అడవి బాట పట్టవచ్చు.
0️⃣7️⃣
పంజాబ్ దేశేమ్ జన్మలియు
సిందు పంజాబేతి దళలాయు
అక్తర్ బక్తర్ బానో రియ 
మాతేపర్ ఘూంగటో రియ
హతేం బాలా చిరో రియ
కాళి పిళీ ఢాల్ రియ.
భావార్థము :- పంజాబ్ రాష్ట్రంలోపుట్టి  సిందుపంజాబ్ నుండి గో..దళమ తీసుకొని రాగలను, బంజారాల వేషధారణలతో తలపై కొంగు (ఘూంగటో )ఒక చేతిలో త్రిసుళము మరోక్క చేతిలో ఒక ఢాల్‌, మరియు తల్వార్ ఉండును.
0️⃣8️⃣
తోళారామెప్ ఆశ్వార్ వీయు
పంచమాహల్ దేశేన్ దళ్ లాయు 
తీన్ కోసేఫ్ ఫేరో రియ
ఫితుర్ పరేతి దాస్ జాయ 
జనతారో రాజ్ ఆయ
గోర్ బంజారారో జండాలగాయ.
భావార్థము :-  తోళారామ్ అనే పేరు గల అశ్వం పై కుసోని, పంచమాహల్ అంటే దక్కన్ పీఠభూమి ప్రాంతంలో గో..దళము తీసుకొని, మూడు కిలోమీటర్ల దూరంలో  తిరుగుతూ, నైజాంనవాబు గో..ధళము చూసి భయపడి ప్రజలందరిని గమనించి బంజారా హిల్స్ లో ఉండండి అని వేడుకొనవచ్చు.
0️⃣9️⃣
రాథోడేరో రాజ్ ఆయ
మహారాష్ట్రమ జండా లగాయ
నితి ధర్మేతి రాజ చాలియ
సత్భగత్  జన్మలియ
కమల్ పట్టా హతేం లియ
గొర్మాటిన్ వాచన్ వతాయ 
జర్మార్ వాత్ ఖోటి వెజాయ 
తో చాందా సూర్య నరకేం జాయ. 
భావార్థము :-  రాథోడ్ రాజ్యం రావచ్చు, మహారాష్ట్రలో  అధికారిపగ్గాలు చెతుల్లో తిసుకొని నితివంతమైన పరిపాలనా చేపట్టవచ్చు, సత్పురుషులు జన్మించి భక్తి  మార్గంలో మంచి మార్గాన్ని అనుసరించవచ్చు ఒక వేల పై మాటలు నిజం కాక పోతే సూర్య చంద్రులు నరకం అనుభవించచ్ఛు.
( రాథోడేరో రాజ్ ఆయా= వసంత్ రావు నాయక్ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అయినారు,)
1️⃣0️⃣
 సోనేర్ సింగ్ గౌవా వకజాయ 
కొని మళ ఢోరున్ చారో 
ఏనురో కుణ కరెవాళో పూరో
హడకారో ఢేరో పడజాయ 
మారి వాతే అంబర్ వీయ 
జ్యార్ నాకతో ధాణి వీయ. 
భావార్థము :- ఒక ఆవు ఖరిదు లక్షలు కావచ్చు, గోవులకు మేత  దొరక్కుండా పోవచ్చు, వాటిని  ఎవరు కుడా పట్టించకపోవచ్చు, గోవు కళేబరాల కుప్పలు పడచ్చు   నేను చేప్పిన మాటలు అక్షరాలా నిజముకావచ్చు.

 శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారు మూడు వందల సంవత్సరాల క్రితం చెప్పిన భవిష్యవాణి  ఒక్కోక్కటి నిజమౌతున్నాయి. కరోనా మహ్మమ్మారి విషయంలో కుడా ఇదే జరిగింది.

కామెంట్‌లు