నిజాం రాజ్య నిషేధం ధిక్కరించిన ధీరుడు
వందేమాతర గీతమాలపించిన సింహ స్వప్నం
హంగూ ఆర్భాటం లేని నిరాడంబర జీవనం
తొలి తెలుగు ప్రధానామాత్యులుగా
అలుపెరుగని అపర చాణక్యుడు
అక్షర సేద్యంతో అధ్భుత రచనలు పండించి
పలు భాషలపై పట్టు సాధించిన మౌన యోగి
ఇన్ సైడర్ ఆత్మకథ సాహితీ పటిమకు తార్కాణం
అవినీతి మరకలంటని స్వచ్ఛమైన తెలుగు తేజం
సమయోచిత కార్యాచరణల స్థితప్రజ్ఞత అపారం
అనంత అనుభవ జ్ఞానామృత సాగరం
అధికార సంద్రంలో మైనార్టీ ప్రభుత నావని
రాజ నీతిజ్ఞతతో తీరం దాటించిన చుక్కాని
తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపిన ఘనుడు
చెరగని ఆర్థిక సంస్కరణల పితామహుడు
బహుభాషావేత్త పీ.వీ. తెలుగు వారి ఠీవి!
(జూన్28, పీ.వీ.నరసింహా రావు గారి శత జయంతి సందర్భంగా)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి