పిల్లల్ని చంకన ఎత్తుకొని ఆకాశంలో నవ్వుతున్న చందమామను చూపిస్తూనో, సరదాగా సాగే చందమామ కథలు చెప్తూనో బువ్వ తినిపించే దృశ్యాలు డైనోసార్లయ్యాయి.
చందమామైనా, చందమామ కథలైనా ఇప్పుడు అర చేతుల్లోనే ప్రత్యక్షం.
సరిత చదువుకున్న ఇల్లాలు. తన గారాల పట్టి హన్షితకు తినిపించేటప్పుడు, ఏడ్చినప్పుడు యూట్యూబ్ పెద్దమ్మనే ఆశ్రయించేది.!
హన్షితకు యూట్యూబ్ పెద్దమ్మనే అమ్మకంటే ఎక్కువైంది.
తన పనులు సులువుగా సాగడానికే కాదు, హన్షితను నిద్రపుచ్చడానికి, జోల పాడడానికి కూడా పాటలపెట్టెనే తెరిచేది.
ఇప్పుడు హన్షిత తోటి పిల్లలతో కలవడం మానేసింది. తనకు ఫోనే ప్రియనేస్తమైంది.
ఆరుబయట ఆడాల్సిన ఆటలు కూడా ఆండ్రాయిడ్ లోనే చక చకా ఆడేస్తోంటే, హన్షిత తన కంటే కూడా మొబైల్ ని బాగా ఆపరేట్ చేస్తోందని సరిత సంబరపడ్డది.
తన నుంచి ఎవరైనా ఫోన్ లాగేసుకుంటే, హన్షిత ఇల్లుపీకి పందిరేసేది.
హన్షితకు ఐదళ్ళు వచ్చేసరికి కూడా స్వతహాగా ఐదేళ్లు లోపలికెళ్లడం లేదు.!,
క్రమంగా కళ్ళల్లోంచి కాలువలు పారడం మొదలైంది. కళ్ళ డాక్టర్ కమలాకర్ ని సంప్రదిస్తే, ఇప్పటికైనా మించింది లేదు అలసత్వం వహిస్తే కళ్ళు నేరేడు పళ్ళవుతాయని ఇద్దరిని మందలించాడు.
దాంతో పాపలో మార్పు ఆవగింజంత ఆరంభమై, ఆందెపుకాయంతైంది. ఆకాశంలో కొత్త చందమామ కన్పించడంతో, హన్షితలో చురుకుదనం లేడి పిల్లలా గెంతులు వేస్తుంది; చలాకీతనం లేగదూడలా చెంగలిస్తుంది.!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి