ప్రక్రియ:-సున్నితం: తొలకరి చినుకు:-పిల్లి.హజరత్తయ్య-శింగరాయకొండప్రకాశం జిల్లా-9848606573

  76) 
 తొలకరిజల్లు ముత్యమై మెరిసింది
ఆశల ఊసులను మోసుకొచ్చింది
ప్రకృతి మాతను సింగారించింది
చూడచుక్కని తెలుగు సున్నితంబు 
77)
తొలకరి చినుకు కురిసింది 
చేలల్లో నీరు ఇంకింది
విత్తనం మొలకెత్తి మురిసింది
చూడచక్కని తెలుగు సున్నితంబు
 
78)
వర్షం అవనిని పలకరించగా
రైతన్న భూములకు దండమెట్టగా
పంటల సాగుకు సిద్ధమవ్వగా
చూడచుక్కని తెలుగు సున్నితంబు 
 
79)
తొలకరి జల్లులు రావాలి
వాగులు వంకలు నిండాలి
పంటలు బాగా పండాలి
చూడచుక్కని తెలుగు సున్నితంబు
 
80)
తొలకరి చినుకులు జల్లులు
పుడమికి పచ్చని హారాలు
మానవ మనుగడకు ఆధారాలు
చూడచుక్కని తెలుగు సున్నితంబు
కామెంట్‌లు