మగువ మానవలోకానికి దేవత:-పిల్లి హజరత్తయ్య: సింగరాయకొండ, ప్రకాశం జిల్లా--సెల్....9848606573
1 స్త్రీ సృష్టికి మూలము
స్త్రీ శక్తి స్వరూపము
స్త్రీ జగత్తుకు ఆధారము
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

2) పడతి సహనానికి ప్రతీక
అమ్మ రూపానికి మాతృక
భూమికి దేవుడిచ్చిన వరం
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

3) ఇలలో వెలసిన దేవత
అమ్మగా,ఆలిగా మురిపించు
మహిళలే ఇంటికి వెలుగు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

4) ఆకాశాన్ని జయించింది మహిళ
ఆత్మవిశ్వాసం కనబరిచింది మహిళ
అవనిపై మేటియైనది మహిళ
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

5) మహిళలపై వివక్షత మానాలి
మహిళలను ప్రతిఒక్కరూ గౌరవించాలి
మహిళా సాధికారత సాధించాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు!!


కామెంట్‌లు