ఎలా అవుతుంది?:- డాక్టర్ . కందేపి రాణిప్రసాద్ సిరిసిల్ల-చర వాణి. 9866160378
ఒకప్పుడు దేశాలపై 
ఆక్రమణలు జరిగేవి
ఇప్పుడు దేహాలపై
జరుగుతున్నాయి.
కనపడుతూ కత్తులతో
పోరాటం చేసేవారు.
అదృశ్య రూపంలోని
సూక్ష్మజీవులు,క్రిముల్ని
భారత దేశం నుంచి
మస్కులతో సానిటైజర్ లతో
తన్ని పంపిస్తెనే 
కలల భారతం
అద్భుతంగా ఉంటుంది.

గ్లోబైజేషన్ పేరుతో
అమెరికా లో ఒక కాలు
ఇండియా లో ఒక కాలు 
పెట్టె యువత ఎగురుతోంది
ఒకనాడు ఇండియాని
వృద్ధాశ్రమం అన్నారు కానీ
వారసుల కోసం వృద్దులు సైతం
అమెరికా పౌరులు అవుతున్నారు.
మన యువత,మన మేధస్సు
ఎక్కడో ఎవరింట్లోనో ఉంటే
మనిల్లు మన కలల భారతం
అపూర్వంగా ఎలా ఉంటుంది.

పాశ్చాత్య దేశాల ననుకరించి
యువత మత్తు లో 
మునిగి తెలుతుంటే
చదివిన చదువు 
ఉద్యోగానికి పనికిరక
దొంగలుగా మారుతుంటే
కలల భారతం ఎప్పుడు
అభివృద్ధి గ్రాఫ్ లో ముందు ఉంటుంది.

దేశానికి సంపడైన పిల్లలు
పబ్జీ గేముల్లో, సెల్ ఫోన్లు లో
ఇరుక్కుపోయి తల బయట పెట్టలేక
మానసిక ఒత్తిడిని తట్టుకోలేక
డ్రగ్స్ కు బానిసలైతే
కన్న తల్లి తండ్రులు
కెరీర్ పేరుతో సంపాదనలో
పరుగులు తీస్తుంటే
చెడిపోయిన పిల్లలతో
కలల భారతం ఎలా
అద్భుత భారతం అవుతుంది.