విశ్వంభరుడు 'సినారె':- కొలిపాక శ్రీనివాస్.-చరవాణి :9866515972
మాతృభూమి హృదయాన
జ్ఞానపీఠమై విరబూసిన
పరిమళాల కుసుమం..!

కలంతో సాహిత్య సేద్యాన్ని
నిర్విరామంగా సాగించిన
సాహితీ పిపాసకుడు సినారె.

నింగిలో వెన్నెల అందాలను
ప్రకృతిమాత ఒడిలో కలబోసి
వసుధ నయనాల ముంగిట
అక్షరముత్యాలను ఆరబోసిన
విరామమెరుగని అక్షరాల వెల్లువ.

మల్లెల చాటున ఎదనిండా
విరహవేదన నింపే మధుర
కవితా జలపాతాల హోరు..!

తెలుగు అక్షరాలతో పాటల
మాలికలు అల్లిన ధన్యజీవి
కవివర్యులు సి నారాయణ రెడ్డి

ప్రతి తెలుగు జాతి గుండెల్లో
గజల్ గానాల లయవిన్యాసం
చేసి.. జీవనదై ప్రాణం పోశాడు

విరహాంగలో విహరించే గీతమైనా
ప్రబోధంతో మహాప్రస్థాన గొంతుకై
ప్రజల హృదయాలను కొల్లగొట్టిన
కవన చైతన్య స్ఫూర్తి ప్రదాత..!

ఈ భువిలో.. దివిలో.. గర్వపడేలా
సాహిత్య శిఖరమైన అద్వితీయుడు
తెలుగు సాహిత్యంలో మేలు రకమైన
పదాలతో రచనలకు గుబాళింపులు  
అద్దిన విశ్వంభరుడు మన సినారె.

(డాక్టర్ సి.నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా)


కామెంట్‌లు