. తెలుగు బాల పదాలు., *శంకర ప్రియ.,* , సంచార వాణి:99127 67098
  *👌కలిమి లేములు యున్న*
 *వింత హంగుల మజిలి!*
  *మన జీవన యానము!*
               *ఓ తెలుగు బాల!* (1)
*👌మానవుని జీవితము!*
 *ఒక రంగుల రాట్నము!*
*తెలుసు కొను మీ నిజము!*
              *ఓ తెలుగు బాల!*(2)
 *👌గిర గిర యని తిరిగే*
   *పలు రంగుల రాట్నము*
*త్రిప్పు వాడే యొకడు!*
              *ఓ తెలుగు బాల!* (3).
*👌పర మేశ్వరు డొక్కడు!*
*పాలకుడు మరియొకడు!*
*పాలితుడు ఇంకొకడు!*
         *ఓ తెలుగు బాల!* (4)