తెలుగు బాల పదాలు:*అ ర్చ క స్వా ము లు*శంకర ప్రియ., సంచార వాణి: 99127 67098

 👌 అర్చనా విధుల తో
       సేవలు సలుపు వారు
         "అర్చక స్వాము" లన
                 ఓ తెలుగు బాల! (1)
           *****
👌భక్తి ప్రపత్తు లతో
       ఆరాధ్య మూర్తు లకు
         పూజలు చేయు వారు!
                  ఓ తెలుగు బాల! (2)
          *****
 👌ఆ శివుని రూపములు!
      నడయాడు దైవములు! 
      అర్చక స్వాము లే!
                ఓ తెలుగు బాల! (3)
            *****
( "అర్చకః హరః సాక్షాత్!".. అనెడు, ఆగమోక్తి ఆధారము గా )
కామెంట్‌లు