సలాం సైనికులకు.:-మచ్చ అనురాధ--సిద్దిపేట9948653223.

 ఉత్పలమాల
వీడిరి తల్లిదండ్రులను వీరులు చేరిరి సైన్యమందునన్,
బాడరు నందు సైనికులు పట్టుగ కాపలకాయు చుండగన్,
దాడిని జేయ శత్రువులు ధైర్యముతోడనుమట్టుబెట్ట పో ,
రాడిరి దేశమందునను రాజుల రీతిన దేశభక్తితో.
ఉత్పలమాల
కంటికి నిద్దురన్ కరువు కన్నులు కాయలు గాయగానిలన్ ,
ఇంటికి దూరమై చలిని యెంచక తిండికి తిప్పలైననూ,
వంటికి తూట్లు పడ్డ తగు పావన జన్మము దేశ సేవకున్,
తుంటరి శత్రు వర్గములు దూర గ చీల్చియు  సంహరించునే.
ఉత్పలమాలిక
శిక్షణ పొందినప్పుడును జేసె ప్రమాణము జన్మభూమికిన్,
దీక్షను బూనిసైనికులు దేహము లెక్కను జేయకుండగన్,
వీక్షణ జేయుచుండుఘన వీరులు శత్రువు మూకలన్ కడున్,
రక్షణ జేయనెంచిరిల లక్షల పుత్రులు దేశ రక్షకున్,
తక్షణ కర్తగా నచట దండి ఫిరంగిని పట్టి కాయుచున్,
దక్షిణ దేశ మాతకును  దాపున నిత్యము పూజ జేయునే,
నిక్షణ జేసెవీరులను నేలన దాచెను భారతమ్మ యే,
మోక్షము పొందినందరికి మూర్ధము వంచి నమస్కరించుదున్.
కామెంట్‌లు