*ఆ.వె*
*మంచికన్నమిన్న-మహిలోనసంపద*
*ధర్మమునకుమించి-తపములేదు*
*నెంచిజూడమనకు-నేదియుగనరాదు*
*సత్యమార్గమెరిగి-సదయనడువు*
*తే.గీ*
*మంచి తనమునదియొకటి-మహినియందు*
*నెంతయున్ననువ్యర్థమే-నెంచిజూడ*
*నెదుటివారిసుగణములు-నెరగకున్న*
*నీదుజ్ఞానమేయౌనుగా-నిండుసున్న*
*ఆ.వె.*
*నిజముదాచిబెట్టి-నిందలుమోపిన*
*నిప్పులాంటి నిజము-నిక్కముగను*
*కల్లలన్నితెలుపు-కనులముందు*
*సత్యమెపుడునిలుచు-సదయవినుము*
*ఆ.వె*
*పరులుమెచ్చువిధము-పనులెన్నొజేయుట*
*సాధ్యపడదుజూడ-సకలమందు*
*మనముజేసెవేవిమర్షించకనుయున్న*
*పనులు జరగబోవు పరగనెపుడు*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి