*గులాబీల మాలలు*:-*మిట్టపల్లి పరశురాములు* - *సిద్దిపేట* *చరవాణి:9949144820*
 బాలలంమేం బాలలం 
గులాబీల మాలలం
 పిల్లలం మేం పిల్లలం 
మాత ఒడిలో మల్లెలం
 
చిలకలం మేం చిలకలం
చిగురించేమొలకలం
గువ్వలం మేంగువ్వలం
వెలుగునిచ్చే బుగ్గలం
 
పాపలం మేం పాపలం 
పసిడిముద్దులరూపులం
కూనలం మేం కూనలం


కురిసే జల్లుల వానలం
 
మొక్కలంమేం మొక్కలం
చక్కనైనా చుక్కలం 
పువ్వులం మేం పువ్వులం
గణగణమ్రోగే మువ్వలం