"ఆట ఆడుకుందామా":-చాపలమహేందర్-9949864152
చెట్టు చెట్టు ఎక్కి
కోతికొమ్మచ్చి ఆడుదామా

గవ్వలు వేసి
అష్ట చమ్మ ఆడుదామా

చింత గింజలతో
ఓనా గుండాలు ఆడుదామా

పులి మేకలతో
పులిజూదం ఆడుదామా

కాయిన్స్ తో
క్యారం ఆడదామా

పాచికలతో
వైకుంఠపాళీ ఆడదామా

ప్రాచీన ఆటలను ఆదరిద్దాం
పూర్వ వైభవం కల్పిద్దాం


కామెంట్‌లు