మూఢ భక్తి:-కంచనపల్లి ద్వారకనాథ్,-- చరవాణి: 9985295605

    వేదగిరి లోని శివాలయానికి రోజూ ఎంతో  మంది  భక్తులు వస్తుంటారు . ఒక రోజు  ఒక  వింత జరిగింది .  ఎన్నో ఏళ్లుగా  ఉన్న గుడి బయట వున్న వేప చెట్టు  కాండం నుండి పాలు కారడం మొదలు  పెట్టాయి .  ఆలయానికి  వచ్చే భక్తులు దాన్ని చూసి వేపచెట్టు దైవ స్వరూపం అమ్మ పాలు కారుస్తోంది . అంటూ రోజు గుడిలో పూజించే శివుని కంటే వేప  చూసిన క్షణం  నుండి   చెట్టు పై భక్తి ఎక్కువై పోయి నంస్కారాలు , సాష్టాంగ నమస్కారాలు ,కర్పూర హారతులు పసుపు ,కుంకుమ బొట్లు  పూజలు ,మొక్కు బడులు   పెరిగి మూఢభక్తి  పెరిగి  పెద్దదై పక్కూర్లకు పాకి పొంగళ్ళు, బలుల దాకాచేరుకుంది . ఈ విషయం ఆ  రాజ్యానికి రాజైన కాళీవర్మ  కు తెలిసి మంత్రి ని   పిలిచి అసలు  ఆ దేవాలయం వద్ద ఏం జరుగుతోందో వెళ్ళి  విషయ  సేకరణ చేసి రమ్మని పంపాడు . మంత్రి  రాజాజ్ఞ ప్రకారం  దేవాలయం వద్దకు చేరుకుని విషయ  సేకరణ పనిలో   పడ్డాడు .    ఇ౦తలో ఆ దారిలో పోతూ  ఒక సాధువు ఆ 
తతంగాన్ని గమనిoచసాగాడు . “స్వామి ఈ వేప చెట్టు పూజలు అందుకోవడానికి మిమల్ని ఆ దైవం ఇక్కడకు  పంపినట్లుంది”  జనంలోనుoడి ఒకడు  అరిచాడు . మిగిలిన వారందరూ  ఒక్క సారిగా  స్వామి కి  జై .. అని అరుస్తూ చుట్టూ గుమిగూడారు .  సాధువు అందరినీ ఒక్కసారి కళ్ళు పెద్దవి  చేసి దూరం జరగమని సైగ చేసి  చూడగా అక్క డే  మంత్రి కనపడ్డాడు .  మంత్రి దగ్గరకు వచ్చి “ నీవు .. ఈ  రాజ్యపు మంత్రిలా వున్నావు. ఈ వింత చూడడానికి  వచ్చావా  ?  “ అనగానే “ లేదు స్వామి .రాజుగారి ఆజ్ఞతో  విషయం కనుక్కోవడానికి  వచ్చాను .” అన్నాడు .”  సరే పద మీరాజు కి నేను అన్నీ వివరంగా చెప్తాను  ‘ అని మంత్రితో కలిసి   రాజు వద్దకు వెళ్ళాడు  . మహారాజుకు మంత్రి సాధువును   పరిచియం చేశాడు . రాజు నమస్కరి౦చాడు .అందరూ  ఆశీనులైన పిదప  రాజు తో “ ఈ వేప చెట్టును౦డి పాలు కారడం ఇప్పటిది కాదు  అన్నీ  ఉర్లల్లో అప్పుడప్పుడు జరిగే  సహజమైన విషయం. నేను ఎన్నో శాస్త్రాలు , వేదాలు తెలిసిన వాడిని . ఇది ఒక మూఢ భక్తి తప్ప .. చెట్టుకు  పాలు కారడంలో   ఎలాంటి దైవ శక్తి  లేదు . ఈ వేప చెట్టు ఎన్నో ఆరోగ్య  సమస్యలు   తీర్చే  కల్పవృక్షం వంటిది . 
వేప చెట్టుకు కూడా అప్పుడప్పుడు జబ్బు చేస్తుంది దానిలోకి కొన్ని సూక్ష్మ క్రిములు  ప్రవేశించినపుడు అది తనలోని నీటిని కాండంలోని  పొరలలో ఒకావిదమైన తెల్లని  ద్రవం కలిపి బయటకు కాండం  రంద్రాలను౦డి బయటకు తెల్లని నురగ  రూపంలో విసర్జించి   రక్షించుకుంటుంది .  అది జనాలకు అర్థం కాక మూఢ భక్తితో పూజలు చేయడం ,దాన్ని అవకాశంగా తీసుకుని  కొందరు   దొంగ  స్వాములు  పుట్టుక రావడం జరుగుతోంది .ఇలాంటి మూఢ భక్తులు  వున్నంత  కాలం  జనం మోసపోవడం . ప్రాణాల మీదికి తెచ్చుకోవడం . బల్లి పడితే ,పిల్లి కనపడితే  అని శఖునాలు  చూడడం ,నరబలులు లాంటివి జరుగుతూనే వుంటాయి . “ అనగానే  “ స్వామి ఇలాంటి సమస్యలకు పరిష్కారమే లేదా ?:” అని అడిగాడు మహారాజు .” ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం వుంటుంది . మీరు చేయ వలసిందల్లా మీ  రాజ్య౦లో  ప్రజలకు  మూఢనమ్మకాలు పోయి   అభ్యుదయభావాలతో ముందుకెళ్ళాల౦టే మొదట మీరు మంచి  గురుకుల  పాఠశాలలు స్థాపించి శాస్త్రపరమైన  విజ్ఞానా న్ని భోదిస్తూ ప్రతి  విషయాన్ని  ,శాస్త్రపరంగా నిరూపించే విద్యావిధానం తీసుకుని రావాలి అప్పుడే ఈ మూఢ  జనం   చైతన్య వంతులై అపోహలు తొలగిపోతాయి .  ప్రజల్లో దైర్యం  ,ఆత్మవిశ్వాసం  పెరుగుతుంది .అనర్థాలు జరగవు .   మీ రాజ్యం బాగుంటుంది . ‘ ఆ నాడు . “ స్వామి మీ మాటలు విన్న నేను తప్పక శాస్త్ర విజ్ఞాన౦ భోదించే  పాఠశాలలను స్థాపిస్తాను . అలాగే   మూఢ   నమ్మకాలను     ప్రోత్సహించే వారిని కఠిన౦గా  దండించే శాసనాలు చేస్తాను అని చెప్పి  సాధువుకు  ఆథిత్యం  అథిది సత్కారం  చేసి పంపాడు.