కళలవిలువ :కంచనపల్లి ద్వారకనాథ్ చరవాణి: 9985295605


  సుగంధపుర రాజ్యాన్ని  శివచంద్రవర్మ  తన రాజ్యంలోని  ప్రజలకు  ఏ లోటు రానీయకుండా సుఖసంతోషాలతో   జీవించేటట్లు పరిపాలిస్తుండేవాడు . ప్రతి ఏటా  తన పుట్టినరోజు పండగకి   వివిద దేశ కళాకారులు, ,  ఖడ్గ  ,గదా, బాణ, మల్ల  విద్యలలో ఆరితేరినవారిని,విప్రవినోదుల్ని,విధుషకుల్ని  , చిత్రకళ , నాట్యం ,సంగీత కళాకారుల్ని  ,ఇంద్ర జాలికుల్ని పిలిపించి వారితో  ప్రదర్శనలు  ఇప్పించి  ప్రజలకు   వినోదంతో పాటు  ,  విజ్ఞానాన్ని  కలిగిస్తూ , ప్రదర్శనల్లో  పాల్గున్న అందరికీ బహుమతులు , ఇచ్చి ,సన్మానిoచి పంపేవాడు . 

 ఎప్పటిలాగే ఈ సారి పుట్టిన రోజు  పండగకి  కళాకారుల్ని ఆహ్వానించాడు .    ప్రదర్శన   జరిగే మైదానంలో ఎందరో రాజులు , బంధువులు ,  పరివారం,మంత్రి , సైనికులు  ప్రజలు ఆశీనులై కళాకారులు చేసే , ప్రదర్శనలు  విన్యాసాలు తిలకిస్తూ    జయ జయ  ధ్వానాలు  చేస్తూ  కరతాళ  ధ్వనులతో  సంతోష  , ఉల్లాస భరితమైన వాతావరణం    ఆ  ప్రాంగణమంతా  నిoడిపోయింది . శివచంద్రవర్మ అందరి ప్రదర్శనలు తిలకిస్తూ ,ఆనందపడుతూ , ఆశ్చర్యపడుతూ “ శబాష్” అంటూ చప్పట్లు  చరుస్తున్నాడు .    ప్రదర్శనలో  భాగంగా  నాగమల్లు , వీరబాహుడు  అనే  ఇద్దరు తమ శిష్యులతో  ఎన్నో  ,ఖడ్గ ,  గద, బాణ ,మల్లయుద్ద విన్యాసాలు మునుపెన్నాడు చూడని విధంగా చేసే చూపిస్తూ అందరినీ అబ్బురపరిచారు . 

ప్రదర్శనలు ముగిసి  పోగానే  మహారాజు కళాకారులని సత్కరిస్తూ నాగమల్లు ,వీరబాహు లతో “ మీ ప్రదర్శన మహా అద్భుతం ఇంత వరకు ఇలాంటి విన్యాసాలు చూడలేదు  మునుపెన్నడూ కనలేదు . శభాష్ .. . మీరు మా రాజ్యంలోనే  వుండిపోయి మా సైనికులకు  శిక్షణ   ఇస్తే వాళ్ళు  సుశిక్షితులై ఇంకా ధైర్యంగా పోరాడుతూ యుద్ధాలలో సులభంగా విజయాన్ని సాధిస్తారు . .మీకు మా రాజ్యంలో ఎలాంటి   లోటు  రానీయకుండా అన్నీ  వసతులతో పాటు ఉద్యో గాన్ని  కల్పిస్తాము . “ అన్నాడు  . అందుకు నాగమల్లు  , వీరబాహు వినయంగా చేతులు కట్టుకుని “ మహారాజ .. ఈ  విద్యా  విన్యాసాల వల్ల మీ సైనికులు   శక్తి   నిచ్చేవి కావు  . ,నైపుణ్యం సంపాది౦చ వచ్చునేమో గాని  యుద్దంలో  విజయాల్ని చేకూర్చలేవు  . కారణం యుద్ద తంత్రాలు ,వ్యూహాలు  ఎప్పటికప్పుడు  మారి  పోతుంటాయి .  ఈ మా  కళలు  మాకు తరతరాల   నుండి అబ్బినవి . అందుకే మా కళలు అంతరించి పోకుండా వుండాలంటే మా దేశంలోనే మాకు స్థానం వుండాలి .ఈ లాంటి కళలు ఇప్పటికె ఎన్నో  అంతరించి పోయాయి .  అందుకని మీ కోరికను మేము  స్వీకరించలేక పోతున్నందుకు .మన్నించండి “  అన్నాడు నాగమల్లు . శివచంద్ర వర్మ” ఆహా .. లెస్సగా  పలికితివి మేము అంత  దూరం ఆలోచించ లేకపోయినాము.. మీరు ఎంచుకున్న దారి సబబైనది. అలాగే కానీయండి.అంటూ  బహుమతులు అందించి  సత్కరించి   ప్రత్యేకంగా కొన్ని  వరహాలను ఇచ్చి “ మీ కళలను మరింత అభివృద్ది , మెరుగు పర్చుకోండి “  అన్నాడు . నాగమల్లు  వీరబాహులు  తృప్తిగా ,సంతోషంగా నమస్కరించి , కృతజ్ఞతలు తెలిపి తమ దేశానికి వెళ్ళిపోయారు . 


కామెంట్‌లు