వేడిమి తాపము పెరిగింది
జ్యోతిక,గీతిక కూడారు
బడికి బయలు దేరినారు
కాలిబాటలో నడిచారు
వాగులు,వంకలు దాటారు
బడికి వారు చేరుకొని
బుద్ధిగా చదువుకొన్నారు
ఇంటి బాటను పట్టారు
దారి మధ్యలో కొచ్చారు
దాహార్తితో పడివున్న
రామ చిలికను చూసారు
గీతిక చేతితో నిమిరింది
బొప్పలో నీళ్ళను పోసింది
చక్కగా చిలుక తాగింది
జ్యోతిక వైపు చూసింది
మెల్లగా చిలుక లేచింది
జామ చెట్టు పైకెగిరింది
జామ పండ్లను తెంపింది
జ్యోతిక ఒడిలో వేసింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి