*తెలుసు కోర పామరుడా**:-తొగర్ల.సురేష్.ASI.Varni.

 వినరా వినరా సోదరా
తెలుసు కోర పామారుడా"విన"
కరుణ లేని కరోనా వచ్చేను రా
మనషిని మట్టిలో కలిపేను రా"విన"
మన గొంతులోకి మెల్లిగ దిగెనురా
గోముగా మనను మసి చేసేను రా"విన"
నిషబ్ద యుద్దమే చేసెను రా
నీ ప్రాణాలనే తోడేను  రా"విన"
అశ్రద్ద నీ విక మానుకో లే రా
యమ కింకరులు నిన్ను వెంబ డించేను రా"విన"
బతికితే బలుసాకు తిని బతుకొచ్చును రా 
బయటి కెళ్ళి బలి కాబోకుము రా"విన"
ఈ వైరస్ ఆటలు సాగనీ యొద్దురా
గడప దాట కుండుటే మేలు కదరా"విన"
ఇంటిలో నిశ్చింతగ ఉందాము రా
ఇల్లే స్వర్గమని తెలిసి నడవ రా"విన"
కర చాలనం చేయ కూడదురా
కరోనా చేతిలో చిక్కి చావకు రా"విన"
సైతాన్ వైరస్సిది సోదరా
సామాజిక ఏడం పాటించుటె బె టరు రా"విన"
ఇంటి గడప నుండు టే ముద్దు కదరా
ఆవారా తిరుగుల్లిక మానము రా"విన"

కామెంట్‌లు