*చెల్లు చీటీ!*:-డా.పి.వి.ఎల్ సుబ్బారావు.

 1.కరోనా ఖతం!
   గతించిన గతం!
  మన అభిమతం!
 విశ్వజన సమ్మతం!
2.ఓ కరోనా!
   మూట ముల్లె సర్దుకో!
   తక్షణం వచ్చిన దారినే పో!
   నీ గుట్టు ఇక రట్టే!
  నీ పట్టు మరి తీసి కట్టే!
3.ప్రథమతరంగం పతనం!
ద్వితీయం తలవంచడం ఖాయం!
  వాక్సిన్ రక్షణకవచం!
  ఆక్సిజన్ ప్రాణ ఉద్దీపనం!
  నియంత్రణ రణం కర్ఫ్యూ!
 నిర్మూలన దశ లాక్ డౌన్!
 అన్ని దిక్కులా దిగ్బంధనం!
 కరోనాకిక పద్మవ్యూహం!
ఆశలు రేపే గణాంకాలు,
    నవజీవనసూర్యోదయాలు!
4.తృతీయం తలెత్తదు!
   కట్టుదిట్టం చేసేస్తాం!
   వెంటాడి వేటాడతాం!
  మనుషులంతా ఒకటవుతాం!
  మరోస్వాతంత్ర్యసమరం,
  నిర్భీతితో సాగిస్తాం!
  విజయులమై నిలుస్తాం!
5.కరోనా కాలాన అవరోధం!
 అధిగమించడం అతి సహజం!
అది మనకు వెన్నతో పెట్టిన విద్య!
  కరోనా బతుకు ఓ మిథ్య!
6.కరోనా మృతుల సాక్షిగా,
                             శపథం!
   చివరిచూపుకైనా నోచుకోని,
 వారి బంధువుల ఆత్మసాక్షిగా,
              మా మనోరథం!
 వ్రాసి ఇస్తుంది,
  కరోనా బతుక్కి *చెల్లు చీటీ!*
  ఇక కరోనా కథ కాటికి!