విశ్వ కథావిపంచి :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
మానవజీవిత గాఢత కథలో 
మలిచి.. నిత్య చైతన్య సమారోహణమై.. 
కథలే ఆశా, కథలే శ్వాస,కథలే 
ఒకపరి కదిలే రథమై.. 
బృహుత్ సంకల్పజగన్నాధ రథచక్రాల్ 
కధామండపo చేరిన వ్యధా చిత్రాల్ 
నవరసకల్పనకి దశమరస ధ్యేయం.. 
కథానిలయం సదా స్వాగతం!
కారా మాస్టారు మనోనేత్రం !
రండి రండీ.. ఈ జ్ఞానజ్యోతి మదిలో నింపుకొనగా.. 

నందనవనమిది కథలకు 
చందనవృక్షము నీడన సాహితీ 
వెన్నెల


లో చంద్రకాంతశిలపైన 
కథానిక గంధర్వకన్య సయ్యాట!
కథల "సిరి"కాకుళము 
అనుభవాల జడి కథావర్షము !
సామాన్య పాఠకుల హాసం, 
పరిశోధనాసక్తుల పావనతీరం!
విశ్వకథావిపంచి !సలలిత రాగ 
సుధ కథామంజరి!