అడవిలో ఓ గాడిద పిల్లకు చదువుకోవాలి అనిపించింది. వెళ్లి అమ్మను అడిగింది. అమ్మ దాన్ని తీసుకు వెళ్లి ఏనుగు గురువుకు అప్పగించించింది. ఏనుగు చెప్పిందిి రవ్వంతైనా అర్ధం కాలేదు. గుర్రం దగ్గరికి వెళ్ళింది. గుర్రం చెప్పేది కూడా అర్ధం కాలేదు. బాగా చదువు చెపుతుందని నక్కకు మంచి పేరుంది. వెళ్లి నక్క దగ్గర చేరింది. నక్క చెప్పేది ముక్కా అర్ధం కాలేదు. పిల్లి, కుక్క, పంది ఇలా అన్నిటిదగ్గరికి వెళ్ళింది. ఏది చెప్పినా నెత్తికెక్కటంలేదు. ఇక లాభం లేదని ఇంటి ప్రక్కనే ఉన్న ఓ ముసలి గాడిద దగ్గరే చేర్చింది. ఇప్పుడు చదువు బాగా వస్తుంది. ముసలి గాడిద ఒండ్రిస్తుంటే, పిల్ల గాడిద బహు చక్కగా పలికేది. పిల్ల గాడిద పలుకులకు తల్లి గాడిద మురిసిపోయేది. ఎలాగైతేనేం పిల్ల గాడిద బాగా చదువుకుంది. పట్టుదలతో, స్వయంకృషితో పై చదువులు చదివింది. పెద్ద ఉద్యోగంలో చేరింది. తల్లిదండ్రులకు బరువులుమోసే బాధ తప్పిించింది.
పిల్లలు! అర్ధం కావటం లేదని మొదట్లోనే చదువు మానేసి ఉంటే గాడిద చదువు అటకెక్కేదే కదూ? ప్రాధమిక విద్యను మాతృభాషలో బోధించే వారి వద్దనే చదవాలి. అప్పుడే వారికి బాగా అర్ధమవుతుంది. పునాదులు బలపడతాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి