ఈ గ్రహణం వీడేదెన్నడో:-*శ్రీలతరమేశ్ గోస్కుల**హుజురాబాద్*

*పట్టిందొక గ్రహణం వత్సరం దాటినా వీడనే లేదు..*
గ్రహణమొర్రిలను ఎందరికో యిచ్చి...
ఇంకా దాగుడు మూతల ఆటనే ఆడుతోంది...

అబ్బర పులి అంటే తోక బారెడు అన్నట్లుగా లేదు ప్రస్తుత పరిస్థితి
నిజంగానే దాని తోక బారెడు కన్నా ఎక్కువే..
ఎంత కత్తిరించినా అమాంతం పెరుగుతూనే ఉంది అంతకంతకూ అధికంగానే...

*అందుకే..*
ఈ గ్రహణం వీడేదెన్నడోనని
అందరి హృదయాల నిండా అలుముకున్న ఆవేదనతో..
అందరి నోటా ఒకటే పాట పారుతోంది..
బతికుంటే బలుసాకు తినవచ్చని...

నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో..
నివేదికలలో దాగింది నిజమంతనే..
ఊపిరుంటే ఉప్పు అమ్ముకోనైనా బతకొచ్చు కానీ..
సడలించిన పరిస్థితి అంతా మంచిదేనని అతిగా నమ్మితే మాత్రం నట్టేట మునగడమే...


కామెంట్‌లు