కోతి మూక - కోళ్ళ విజయం*(గేయకథ)-: ఆరవ భాగము :-:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 21)
దెబ్బకు జడిసిన ఆ కోతి
అడవికి పరుగూ తీసింది
అది చూసిన ఆఊరి కోళ్ళూ
ధైర్యంతో కోతులనెదిరించాయి!
22)
కోళ్ళదెబ్బకు కోతులమూక
బాగా బెదిరీ పోయిందీ
"వచ్చెను బుద్ధీ, బ్రతుకు జీవుడా"
అంటూ అడవికి పరుగు తీసింది!
23)
అడవికి వెళ్ళిన కోతులమూక
మళ్ళీ ఊరికి రాలేదు
ఊరిలొ ఉన్న జనాలు అంతా
తమ కోళ్ళను చూసి మురిశారు!
24)
ఆహా! ఓహో! మాకోళ్ళూ!
ధైర్యం ఉన్న మాకోళ్ళూ!
ఒకటిగ ఉండే మాకోళ్ళూ!
విజయం పొందే మాకోళ్ళూ!!!
(సమాప్తము)
{ఫిబ్రవరి 2008 మొదటి వారంలో TVలో వచ్చిన ఒక వార్త ఆధారముగా}