ప్రాణాలు నిలిపే వాడు:- డా.. కందేపి రాణీప్రసాద్.

అంటురోగికి ఆమడ దూరం ఉండాలని తెల్సినా
అక్కున జేర్చుకొని ఆదర్శంగా నిలిచేవాడు డాక్టరు
మందులేని మయరోగామొచ్చి అల్లల్లాడుతుంటే
మానవత్వంతో ముందుకొచ్చి తెగించేవాడు డాక్టరు!

ప్రపంచమంతా ఇళ్ళలో చేరి ముడుచుకున్నా
కనపడని శత్రువుతో యుద్ధం చేసేవాడు డాక్టరు
ప్రకృతి పగబట్టి జబ్బులతో వేధించుకు తింటున్నా
కంటికి రెప్పలా రోగికి వైధ్యమంధించేవాడు డాక్టరు

పాడు రోగాలతో ప్రజలందరు చచ్చిపోతున్నా
కరోనాకు ఎదురునిల్చి పోరాటం సల్పేవాడు డాక్టరు 
పలకరించేవారు లేక క్వారంటైన్ లో పడి ఉన్నా
కలబడి వైరస్ ను కత్తితో కండనరికేవాడు డాక్టరు!

అంతుపట్టని రోగం అంతు తెల్చేవాడు డాక్టర్
అసుర జాతి కరోనాను ఉసురు తీసేవాడు డాక్టర్
అంతేలేని ఆకలున్న కోవిడ్ ను పాతరేసేవాడు డాక్టర్!
ఆరిపోయే ప్రాణ దీపాలకు చమురు పోసేవాడు డాక్టర్!

ఆత్మీయంగా వెన్నుతట్టి దైర్యమిచ్చేవాడు డాక్టర్
ఆదుకుని భుజాలపై చెయ్యేసి ఉతమయ్యేవాడు డాక్టర్
ఆన్ని వేళలా ప్రాణాలు కాపాడేవాడు డాక్టర్
అన్ని కలాలూ ప్రాణాలు నిలిపేవాడు డాక్టర్!