*మరుగు!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు

 1.అందానికి వస్త్రం మరుగు!
   శృంగారానికి సిగ్గు మెరుగు!
   తాళి అందరిలో కట్టు!
   ఆపై సంసారం గుట్టు!
   సుఖజీవనానికి మెట్టు!
2.పేరిన మురుగు!
   తరిగిన మరుగు!
   రోగమై ముదురు!
   మరి లేదు ఎదురు!
3. అజ్ఞానం మరుగు!
    విజ్ఞానం వెలుగు!
     మంచి పెరుగు!
    చెడు వెనుకడుగు!
4.మనిషి ! నీరై మరుగు!
   జలదమై నేల కురియు!
   ఘనమైన మరుగు!
   జన్మవిలువ తెలియు!
5.దైవం సైతం తెరమరుగు!
   తెరతీయకున్నంత కాలం!
   అదో చిదంబరరహస్యం!
   తొలగిన క్షణం లోనే!
  తెలిసివచ్చేది మహాశూన్యం!
6.మనిషి!
   జననం చురుకు!
   జీవనం ఉరుకు!
   మరణం మరుగు!
  తప్పని కనుమరుగు!

కామెంట్‌లు