శ్రీకృష్ణుని యోగ విభూతి(ఏకపాత్రాభినయయం)-సత్యవాణి

   "అర్జునా!   నీవడిగినట్లే నేను   నా వైభవోపేతమము  లైన సృష్టులనుగూర్చి  కొన్ని ప్రధానములైనవి మాత్రము తెలిపెదను  వినుము.
     ఓ  కౌన్తేతేయా! నేను సర్వజీవుల     హృదయాలలో నివసించునట్టి  పరమాత్మను.  సర్వ జీవులకు  ఆది, మధ్యాంతరమలు  నేనే అయివుంటిని.
     ఓ అర్జునా! వినుము. నేను ఆదిత్యులలో విష్ణువును . తేజస్సులో ప్రకాశవంతమైన   సూర్యుణ్ణి. మరుత్తులలో మరీచుడను. నక్షత్రములలో  చంద్రుడినై  వెలుగుతూ  వున్నాను.
    అంతేకాదు కిరీటీ!‌   నేను వేదములలో   సామవేదమును.  దేవతలలో    స్వర్గాధిపతియైన ఇంద్రుడను.  ఇంద్రియ ములలో మనస్సును.  జీవులన్నిటికినీ  ప్రాణమునై వున్నాను.
     అంతే  కాదు విజయుడా!  రుద్రులలో శివుడను నేను. యక్ష ,రాక్షసులలో కుబేరుడను నేను.  వసువులలో అగ్నిని.  పర్వతములలో  మేరువు పర్వతము అయి వున్నాను 
          ఓ అర్జునా! పురోహితులలో  ముఖ్యుడైన  బృహస్పతిని నేను. సేనా నాయకులలో కార్తికేయుడను. మరియు జలనిధులలో  సముద్రుడనై  వున్నాను.
     మహఋషులలో  బృగువును. ధ్వనులలో దివ్యమైన  ఓం...కార నాదమును.. యజ్ఞములలో  జప యజ్ఞాన్ని.  స్థావరములైన వాటిలో  హిమాలయమును   అయివున్నానునేను. 
     అర్జునా! వృక్షములలో రావి చెట్టును నేను. దేవ ఋషులలో నారదమహర్షిని.  గంధర్వులలో చిత్రరథుడను.  సిధ్ధులలో కపిలుడనై వున్నాను.  
   అశ్వములలో ఉచ్చైశ్రవముగా   పిలువబడుచున్నాను. అలాగునే  గజరాజులలో ఐరావతమును , మరియు నరులలో రాజును నేనైవుందును. 
     ఫల్గుణా ! ఆయుధములలో  వజ్రాయుధమును నేను.  గోవులలో  కామధేనువును నేనే. ప్రజోత్పత్తి   కారకులలో   మన్మధుడను నేను. మరియూ   సర్పములలో  వాసుకిని నేనే  అయి  వున్నాను.
నేను  పెక్కు  పడగలు  గల అనంతుడిని.  జలవాసులలో వరుణదేవుడిని.  పితృదేవతలలో ఆర్యముడను.  ధర్మ  నిర్వహణలో మృత్యుదేవత  అయిన యముడను   అయివున్నాను.
    ‌దైత్యులలో  భక్తుడైన ప్రహ్లాదుడను..  అణచు వానిలో కాలమును.  మృగములలో   సింహమును.  పక్షులలో గరుత్మంతుడనై   వున్నాను. 
     పవిత్ర  మొనర్చువాటిలో  నేను వాయువును.  శస్త్రదారులలో నేను శ్రీరాముడిని.   జలచరములలో  నేను మకరమును.  నదులలో గంగానదిని  నేనై  వు
న్నాను.
          ఓ అర్జునా!  సర్వ సృష్టులకూ  ఆది, అంతిమ,    మధ్యములుకూడా నేనే.  అదే  విధంగా  నేను శాస్త్రములలో  ఆధ్యాత్మిక శాస్త్రమును  నేను. అదేవిధంగా  తార్కికులలో  కపటిని,  సత్యమును  నేనే అయివున్నాను.
.     అర్జునా  !  నేను అక్షరములలో  "అ  ""కారమను. సమాసములలో ద్వంద సమాసమును.   శాశ్వతమైన కాలమునునేను.  సృష్టి కర్తలలో బ్రహ్మను నేనే అయివున్నాను. సమస్తమునూ  మ్రింగి వేయగల   మృత్యువునూ,  సృష్టించ  బడుచున్న   జీవుల   వుధ్బవమునూ  నేనే   అయివున్నాను.  స్త్రీల  యందలి యశస్సు, వైభవము,  మనోహరమైన వాక్కు,  జ్ఞాపకశక్తి,  బుధ్ధి, ధృతి,  ఓర్పునూ   కూడా  నేనే.  
      నేను   సామవేద  మంత్రములలో  బృహత్సామమును.  ఛందస్సులలో   గాయత్రిని. మాసములలో   మార్గ శీర్షమును.   ఋతువులలో     వసంత   ఋతువును అయి  వున్నాను.  
     నేను   మోసములలో జూదమును,  తేజస్సులో  తేజస్సునై   వున్నాను.  అలాగునే  జయము, సాహసము,   బలవంతులలో బలమునూ   కూడా  నేనే.
     నేను   వృష్టి వంశీయులలో వాసుదేవుడను.  పాండవులలో    అర్జునుడను.   మునులలో  వ్యాసుడను.   ఆలోచనా పరులలో    శుక్రాచార్యుడను   అయివున్నాను. 
     నేను   చట్టపధ్ధతిన అణచువారిలో    శిక్షను.  జయమును   కోరువారిలో నీతిని.  రహస్యమలలో   మౌనమును.   జ్ఞానవంతులలో   జ్ఞానమునై   వున్నాను.
      ఇంకనూ  ఓ  అర్జునా!  సర్వ  జీవులలో  జన్మకారక బీజమును  నేనే.  ఇంకనూ స్థావర  జంగములలో   నేను   లేకుండా   ఏదియు  స్థితిని   కలిగి   వుండలేదు.
    ఓ  శత్రుంజయుడా!   నా దివ్య   విభూతులకు   అంత  మనునది   లేదు.  నేను   నీకు తెలిపిన  దంతయును,  నా  అనంత విభూతుల  యొక్క సూచనలు   మాత్రమే.
     సంపన్నములు,  సుందరములూ,  వైభవోపేతములును   అగు సర్వసృష్టులు   నా తేజోంశమునుండి  ఉద్భవించినట్టివిగా   తెలిసికొనుము.
    కానీ   ఓ  అర్జునా!  ఈ సవిస్తరమైన  వివరణ  అవసర  మేమున్నది?  కేవలం  ఒక   ఆంశ  మాత్రము   చేతనే   నేను ఈ సమస్త   విశ్వమునూ  వ్యాపించి   పోషించు  చున్నాను.
 ఈ విషయము  నీవేకాదు, జ్ఞానవంతులైన   నరులందరునూ   గ్రహించ   మేలుకలుగును.