1.ఆలోచనల్లో! లోచనాల్లో!
భావాల్లో! బాహువుల్లో!
రచనల్లో! ప్రవచనాల్లో!
ఆశల్లో! ఆశయాల్లో!
2.ముందుంటావ్!
దారి చూపిస్తావ్!
తోడుఉంటావ్!
చేయిపెట్టి నడిపిస్తావ్!
జీవనశ్రుతివి!
మధుర ఆకృతివి!
పాదముద్రవి! పదముద్రవి!
3.ఆనందవనానివి!
నిత్యవసంతానివి!
వేకువకూతవి!
వెన్నెలపూతవి!
అందానికి అధరానివి!
మాధుర్యానికి అమృతానివి!
కమ్మని కల్పనవి!
కదలని ఆలంబనవి!
4. *రమ్య అక్షరానివి!*
దివ్య వరానివి!
భవ్య రాగానివి!
మరణానంతర జీవితానివి!
*నీవు నా!*:- డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి