స్నేహం..:-తాటి కోల పద్మావతి గుంటూరు

 వాడెవడైనా: 
.వాడెవడైనా సరే 
.స్నేహం కావాలి .
వర్గం కులం మతం .
ఏవైనాసరే .
స్నేహం కావాలి .
మహానదిలా
 పాయలు పాయలుగా 
విడిపోయి 
పరిఢవిల్లుతున్న 
జీవనదిలా కావాలి .
అచంచల ఆత్మవిశ్వాసంతో 
ఆత్మీయతకు
 ప్రతిరూపము కావాలి .
కష్టాలకు కుంగని 
సుఖాలకు పొంగని 
మూర్తిత్వం కార్య దీక్షకు 
కంకణమై 
నీడల్లే వెన్నంటే 
స్నేహం కావాలి.
చేయూత నందించి 
చెలిమి చేయాలి.
మజిలీ లేని ప్రయాణంలో 
వెలుగుకిరణమై 
దారిచూపాలి .
పుడమిపై పచ్చదనానికి
 హరితవనమై 
ఎడారుల్లో చిగుళ్లు 
తొడిగి ఆకలిదప్పులు తీర్చే 
ఉద్యావనమై 
శిశిరంలో వసంతాలు 
పూయించాలి పూయించాలి .
తడారిపోయిన 
గొంతులకు దాహార్తి తీర్చే 
నీటిబొట్టయి అమృతవాహినిగా 
ఆశావహులకు ఆనందం పంచాలి .
జనజీవనాలకు
 చైతన్య స్రవంతిలా 
ఉద్దీపమై వెలగాలి .
సతతం సేవించే జన్మ 
అదే అసలైన స్నేహం అదేకావలి .

కామెంట్‌లు