హరివిల్లు: -పి. హజరత్తయ్యసింగరాయకొండసింగరాయకొండప్రకాశం
1) సోదరభావాన్ని
పెంపొందించాలి
ప్రపంచ శాంతికి
బాటలు వేయాలి

2)ఉన్నత ఆశయాలు
ఏర్పరచుకోవాలి
సాధించటం కోసం
నిత్యం కృషిచేయాలి

3)కర్షకుడు పొలాన్ని
దున్ని చదునుచేస్తాడు
నారునాటి నీరుపోసి
పంట పండిస్తాడు

4)ప్రజలు మెచ్చిన భాష
మన తేట తెలుగుభాష
పసిడి పలుకులు భాష
మన తేట తెలుగుభాష

5)తెలుగుభాష ప్రవాహం
జీవనది లాంటిది
మాతృభాష తియ్యదనం
తల్లిపాలవంటిది

6)క్రీడల్లో పాల్గొని
చక్కగా రాణించాలి
భారతావనికి
ఖ్యాతిని తెచ్చిపెట్టాలి

7)ఆటల పోటీల్లో
ప్రతిభను చాటాలి
ఫలితం ఏదైనా
ముందుకు సాగాలి

8)మహాత్ముల వోలె
ప్రశాంతంగా ఉండండి
అప్పుడు మహనీయులు
మీరుకాక మరెవరండి

9) నిజాయితీ పరులు
ఎప్పుడూ తప్పుచేయరు
అవినీతి పరులు
నీతిని కాపాడలేరు

10 చేసేపని మీద
ఇష్టం పెంచుకో
నీమనసు మీద
పట్టు సాధించుకో

11) గురువు ఒక మేధోఝరి
ఆలోచన సింధువు
భవిష్యత్ దార్శనికుడు
అనుభవాల నిఘంటువు

12) ఆడంబరాలకు పోరు
నిరాడంబరులు
ఎదిగినా ఒదిగేవారు
వివేకవంతులు

13) గురువుగారి మాటలు
ఎదలో నిలిచిపోవు
చిన్ననాటి గుర్తులు
త్వరగా చెరిగిపోవు

14) కష్టపడే వారికి
విజయాలు ఎక్కువ
మంచిని పంచేవారికి
ప్రశాంతత ఎక్కువ

15)కోపంతో నడిస్తే
ప్రశాంతత ఉండదు
ఆలోచించకపోతే
జీవితం నడవదు

16)మనది కర్మభూమి
మనం శాంతికాముకులం
మనది పుణ్యభూమి
అహింసావాదులం

17) నీవే ఎదిగితే 
నీకెవరు సహకరించరు
నలుగురూ ఎదిగితే
నీకు సహకరిస్తారు

18) నీవు గెలిచినట్లయితే
వినయంగా ఉండు
నీవు ఓడినట్లయితే
ఓర్పుగా ఉండు

19) జీవితాలను నిలబెట్టే
దేవుళ్ళు గురువులు
సమాజాన్ని నిలబెట్టే
నిర్దేశకులు గురువులు

20) చదువు సంధ్యలన్ని
అందించేది గురువు
పిల్లల భవితవ్యాన్ని
నిర్మించేది గురువు

21) జ్ఞాన సంపదలకు 
సన్నిధులు గురువులు
నిత్య విద్యార్థులకు
పెన్నిధులు గురువులు

22) తల్లిదండ్రులు బిడ్డలకు
ప్రధమ గురువులు
ఉపాధ్యాయులు శిష్యులకు
ప్రధాన గురువులు

23) ఎవరైనా మనకు
ఇచ్చేది తాత్కాలికము
కష్టపడితే మనకు
వచ్చేది శాశ్వితము

24) పెరుగును చిలికితే
వెన్నయే వచ్చును
అక్షరాలను మధించితే
భావాల నురగొచ్చును

25) మానవుని మాధవుడిగా 
చూపేది విజ్ఞానం
మానవుని దానవునిగా
నిలిపేది అజ్ఞానం

26)మనో రుగ్మతలకి
మందే అక్షరము
వ్యక్తిత్వ వికాసానికి
అక్షరమే ఆయుధము

27) సమయపాలన పాటిస్తే
విజయాలు వరించు
మితాహారం పాటిస్తే
ఆరోగ్యం సిద్ధించు

28) కృషి చేయకుండా
ఫలితం ఆశించరాదు
కష్టపడకుండా
ఫలితం సిద్ధించదు

29) ధనంలో పుడితే
అనుభూతి నిస్తుంది
పేదరికంలో పుడితే
బ్రతకడం నేర్పుతుంది

30) గొప్పలు చెప్పుకుంటే
గౌరవం పోతుంది
మైత్రి పోగొట్టుకుంటే
జీవితం దెబ్బతింటుంది

31) మాట్లాడే ముందు
ఆలోచించి మాట్లాడు
నోరు విప్పేముందు
విజ్ఞతతో యుండు

32) సంతోషం నేర్పలేదు
 గెలుపు పాఠాలను
ఓటమి నేర్పు కలదు
ఎన్నో జాగ్రత్తలను

33) ఆపదలో చేసిన
సహాయం మంచికే
మంచివారితో చేసిన 
స్నేహం మన గెలుపుకే

34) కొన్ని ప్రశ్నలకు
సమాధానం మౌనము
కొన్ని సందర్భాలకు
జవాబు స్పందించడము

35) అహం పెరిగితే
ఆనందం కోల్పోతావు
కోపం పెరిగితే
జీవితం కోల్పోతావు

36) అవసరం అయితే
కాళ్లు పట్టుకుంటారు
అవసరం తీరితే
కాలర్ పట్టుకుంటారు

37) బాధలు ఓర్చుకుంటే
బాధ్యతలు నెరవేరు 
నవ్వును నేర్చుకుంటే
ఆరోగ్యం వచ్చి తీరు

 38) ఓర్పు నీలో ఉంటే
కష్టాలను ఎదిరించు
ధైర్యం నీలో ఉంటే
బాధలను భరించు

39)కష్టాలు ఉన్న వారికి
సహాయం చేయాలి
బాధలో ఉన్న వారికి
బాసటగా నిలవాలి

40) అధర్మం చేసే వ్యక్తి
దర్జాగా బతుకుతాడు
ధర్మం చేసే వ్యక్తి
భయంగా నడుస్తాడు

41) భవిష్యత్తును ప్రేమించు
ఆనందంగా బ్రతుకు
తక్కువగ ఆలోచించు
ఆరోగ్యం దొరుకు

42) కష్టపడి బతికేవాడు
ఎప్పుడూ ధనవంతుడే
కడుపు కొట్టేవాడు
ఎప్పటికి పేదవాడే

43) గుర్తించుకోవడానికి
మంచి చేసిన చాలు
మరిచిపోవడానికి
చేసిన గాయం చాలు

44) చుట్టూఉన్న మనుషులు
పని ఉంటే పలకరించు
అవసరం లేని మనుషులు
నీతో ప్రేమను నటించు

45) ఆలోచన రావాలి
 కష్టం వచ్చినను
మనో ధైర్యం కావాలి
కష్టాన్ని అధిగమించను

46) రోజు నీరు పోసినా    
చెట్లు ఫలాన్ని ఇవ్వవు
సమయం రాకపోయినా
ఫలితాలు రావు

47) మనశ్శాంతి లేక పోతే
బాధలు పెరుగును
ప్రశాంతత ఉన్నట్లైతే
సంతోషాలు కలుగును

48) మనం చేసే ప్రతి పని
సంతృప్తి నివ్వాలి
మనం ఎదుటి వారిని
ఆనందంగ ఉంచాలి

49) మొక్క ఎదగాలంటే
మంచి మట్టి కావాలి
పిల్లలు ఎదగాలంటే
సంస్కారం ఉండాలి

50) సాధించలేని వాడు
నిలబెట్టుకోలేడు
సాధించుకున్నోడు
దేనిని వృధా చేయడు

51) మాట్లాడిన తర్వాత
ఆలొచించు అజ్ఞానం
ఆలోచించి తర్వాత
మాట్లాడు జ్ఞానం

52) జీవితం చిన్నది
ఎదుటివారిని నవ్వించు
జీవితం విలువైనది 
సంతోషంగ జీవించు

53) తప్పులు చేసిన వాడిని
మనం మన్నించ వచ్చు
మోసంచేసిన వాడిని
క్షమించ లేకపోవచ్చు

54) ఎంతగ సాయం చేసిన
వాడు గుర్తుంచుకోడు
ఒక్కసారి కుదరదనిన
చచ్చిన మరిచిపోడు

55) అధీనంలో లేనివి
మనిషి పరిస్థితులు
అధీనంలో ఉన్నవి
మనిషి ప్రవర్తనలు

56) ఎమి తిన్నామన్నది కాదు
ఆకలి తీరుట ముఖ్యం
అందం ముఖ్యం కాదు
మంచి మనసు ముఖ్యం

57) నమ్మకం ఎక్కువైతే
ద్రోహం తప్పదు మనకు
దగ్గరలు ఎక్కువైతే
దూరం తప్పదు మీకు

58)డబ్బులు నీవు ఇచ్చితే
మనోడు అంటారు
డబ్బులు ఇవ్వకపోతే
పగోడు అంటారు

59) పుస్తకాలను చదివితే
విజ్ఞానం వస్తుంది
మనుషులను చదివితే
లోకజ్ఞానం వస్తుంది

60) ఇరుగు పొరుగు మాటలు
అస్సలు వినకండి
భార్యభర్తల మాటలు
ఒకరినొకరు నమ్మండి

61) వారు అన్నది మాత్రం 
చెప్పనే చెప్పరు
మనం అన్నది మాత్రం
ప్రచారం చేస్తారు

62) మనిషి ఉండరాదు
విలువ లేని చోట
మంచితనం ఉండదు
కష్టం లేని చోట

63) ఎంత కష్టం వచ్చినా
ఓదార్చు కోవాలి
ఎంత నష్టం వచ్చినా
ముందుకు నడవాలి

64) పిలవని వాళ్ళ ఇంటికి
అన్నానికి వెళ్ళరాదు
కనికరం లేని వారికి
కష్టం చెప్పకూడదు

65) ఎంత కష్టం వచ్చినా
నిన్ను చూసి నవ్వుతారు
నీ బాధను చూసైనా 
నిన్ను దగ్గరికి తీయరు

66) మర్రిచెట్టు క్రింద
చెట్టులా ఎదగకండి
సూర్యుని క్రింద
గడ్డి పోచగ నిలవండి

67) పట్టింపులు వదిలితే
స్నేహం చిగురించు
శత్రువులు తగ్గితే
సహవాసం వికసించు

68) చికాకులు పోవడానికి
చిరునవ్వు చాలు
కన్నీరు పోవడానికి
చల్లని చూపు చాలు

69) ప్రార్థన ఆత్మను
శుద్ధి చేస్తుంది
దానం సంపాదనను
సార్థకం చేస్తుంది

70) ఎలాంటి బాధకైనా
ఓ అంతం ఉంటుంది
ఎలాంటి సమస్యకైనా
పరిష్కారం ఉంటుంది

71) చచ్చేదాకా బతికితే
అది నీ జీవితము
చచ్చి కూడా బతికితే
అది నీ మంచితనము

72) ఒక్క చిరునవ్వు
బాధను మురిపిస్తుంది
చక్కని నువ్వు మాత్రం
జీవితం మారుస్తుంది

73) నువ్వు తలవంచితే
లోకం గుసగుసలాడును
నువ్వు తల ఎత్తినా
లోకం తలవంచను

74) కోపం వలన మనిషి
జ్ఞానం కోల్పోతాడు
దాంతో బుద్ధి నశించి
చివరకు నాశనమవుతాడు

75) ఏదో సాధించడం
కాదు గొప్పతనం
ఎవరిని బాధించక
బతకడం గొప్పతనం

76) పేరును కోల్పోతారు
అబద్ధం మాట్లాడిన
ప్రేమను కోల్పోతారు
అహంకారం కలిగిన

77) నీలోని చెడు నీకు
మాత్రమే తెలియాలి
నీలోని మంచి మాత్రం
జగమంతా వెలగాలి

78)రైతులు పొలాల్లో
స్వేదాన్ని చిందించు
ఎంతో నేర్పు ఓపిక తో
పంటలు పండించు

79) ఎదుటివారి గుణాలను
నీవు ద్వేషించ బోకు
నీలో అలాంటి గుణాలు
నీవు దరి చేరనీయకు

80 ) విష్ణు సింహాసనము
కద్రువ నాగమాత
పరమశివుని ఆభరణము
మన నాగ దేవత

81) జీవితం అంటేనే 
సుఖదుఃఖాల మయం
జీవన పయనం అంతా
చీకటి వెలుగుల మయం

82) నూతన జాతీయ విద్య
భవిష్యత్తుకు పునాది
అవకాశాల నందించు
నూతన శకానికి నాంది

83) ప్రశ్నించనంతవరకు
అందరికి అయిన వాళ్ళం
ప్రశ్నిస్తే మాత్రం
అయిపోతాం పగ వాళ్ళం

84) అర్థం చేసుకోడానికి
జీవితం సరిపోదు
అపార్ధం పెరగడానికి
అర నిమిషం పట్టదు

85) భవిష్యత్తు చెబుతోంది 
నీ కోసం శ్రమించుమని
దైవము చెబుతోంది
మంచి చేస్తుండమని

86) మట్టితో పోరాడిన
విత్తనం మొలకెత్తును
ఎదురుదెబ్బలకు నిలిచిన
మనిషి ఎదగ గలుగును

87) కార్తీక మాసం మనకు
పరమపవిత్ర మాసము
హరిహరులకు, భక్తులకు 
అత్యంత ప్రీతికరము

88) ప్రతిఫలం ఆశించరు
మంచి మనసున్న వాళ్ళు
తప్పక సాయం చేయును
మనసున్న గొప్పవాళ్లు

89) నియమనిష్టలతో
భగవంతుని సేవించు 
 శక్తిసామర్ధ్యాలను
పూర్తిగా వినియోగించు

90) ఆలుమగలు ఇరువురు
సంసార రథసారథులు
గురుశిష్యులు ఇరువురు
భావి భారత ప్రధాతలు

91) చదివిన ప్రతి అక్షరము
తప్పక ఉపయోగపడును
చేసిన ప్రతి మంచి పని
మనకు మేలు చేకూర్చును

92) శాశ్వతాలు కావు
 సంపాదన, జీవితము
శాశ్వతమైంది ఒక్కటే
మనలోని మంచితనము

93) ఎప్పుడూ బాధపడకు
బ్రతుకు భయ పెట్టును
ప్రతిక్షణం నవ్వుతుండు
జీవితం తలవంచును

94) చీకటంత ఒక్కటైన
దాచ లేదు వెలుగును
దుష్టులంత ఏకమైన
ఆపలేరు విజయమును

95) స్థిరమైన గమ్యం
 మార్గాన్ని చూపించు
రాజీ లేని ప్రయత్నం
విజయాన్ని అందించు

96)సహనం పరిక్షించకు
బంధాలు దూరమగును
మంచిని తునమాడకు
మానవత్వం నశించును

97)సమాజ పురోగతిని
నిర్దేశించు శ్రామికులు
ప్రగతి రథచక్రాలను
లాగు ప్రగతి కాముకులు

98) పుస్తకాలను చదవండి
ఇవి నిజమైన నేస్తాలు
గొప్పగా ఎదగడానికి
దారిచూపు సాధనాలు

99) నుదిటిరాత,గీత అని 
 కూర్చుంటే కుదరదు 
 ఎవరైన కష్టపడంది 
 లక్ష్యం చేరుట జరగదు

100) సరిగ్గా ఆరంభించు 
నీవు ప్రారంభమును
ఫలితం తప్పనిసరిగా 
నీ దరి చేర వచ్చును