సమయస్ఫూర్తి....అచ్యుతుని రాజ్యశ్రీ

 చంద్రసేనుడనేరాజు దగ్గర సారసుడనే విదూషకుడు ఉండేవాడు.మంచి తెలివితేటలు కలవాడు. ఎవరితోఎలా మాట్లాడాలో తెలిసిన బతకనేర్చినవాడు. కాకపోతే పాండిత్యం లేదు. కవి పండిత సభకి హాజరయినా అతని బుర్రలోకి  ఏమీ ఎక్కేదికాదు. సభలోఉన్న అందరికీ  అర్థం కాకపోయినా  ఆహా ఓహో అంటూ భలేభలే అని పైపైకి అనేవారు. ఆవిషయం రాజుకి తెలుసు. సభికులకు సారసుడంటే కోపం అసూయ. దాని అర్థం చెప్పు. ..ఈకవిత భావం ఏంటీ? అని పరాభవం చేసినా  సారసుడు నవ్వేసి ఊరుకున్నాడు.అక్కసుతో తమ గొప్పలు డబ్బాకొట్టి ఇతరుల ను కించపరిచేవారికి దూరం గా ఉండాలి. బురదమీద రాయివేస్తే మన మొహాన పడుతుంది.
ఒకసారి రాజు కావాలనే విందు ఏర్పాటు చేశాడు.  సారసుని వేళాకోళం చేసే ముఖ్యులైన ఐదుగురిని ఆహ్వానించాడు.తమతోపాటు సారసుడు రావటం వారికి రుచించలేదు.అతనిని బాగా ఏడిపించి రాజుకి కనువిప్పు కలిగించాలని సారసుడు ఒకపాండిత్యంలేని చవట అని నిరూపించాలి అని ఇలా అన్నారు "ప్రభూ!ఒకరు పద్యం చెబితే పక్క వాడు దాన్ని వివరించాలి." అలా బల్లచుట్టూ కూచున్న వారి తరువాత  సారసుని వంతు వచ్చింది. "అయ్యా!మీరంతా పెద్దలు పండితులు. మీముందు  నేను చాలా చిన్నవాడిని. సరే ఈఉడకబెట్టిన కోడిగుడ్డు ని ఈబల్లపై నించోబెట్టగలరా?"అంతా తెల్లమొహాలేశారు. రాజు నవ్వు తూ చూస్తున్నాడు.ఎవరూ నోరెత్తలేదు. తలవాల్చారు. సారసుడు గుడ్డు  ఒక కొనని కొద్దిగా పగలకొట్టి చక్కగా నిటారుగా నిలబెట్టడం చూసి అంతా విస్తుబోయారు.అప్పుడు రాజు అన్నాడు "మీరంతా గొప్ప పండితులు. కానీ గర్వం పనికిరాదు.ఇతరులను అహంకారం తో కించపరచరాదు.సారసునికున్న తెలివితేటలు  చాకచక్యం సమయస్ఫూర్తి మీకేవి?"అంతే ఎవరూ నోరెత్తలేదు. క్లాసులో పిల్లలు అందరికీ ఎ..గ్రేడ్ రాకపోతే వారిని కించపరిచరాదు.వారు ఆటపా టలు డ్రాయింగ్ లో రాణించేవారు కావచ్చు. మార్కులు కొలమానంగాదు. సహజతెలివితేటలు కొత్త ఆలోచనలు ఊహలతో పైపైకి ఎదిగేవారు  ఎందరో!!
కామెంట్‌లు