కవితా సంకలనంలో బొల్లారం కవులకు చోటు


 జిన్నారం: జాతీయ స్థాయిలో తెలుగులో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి చరిత్ర నేపథ్యంగా కవితల పోటీ నిర్వహించారు. వీటి నుండి ఉత్తమ కవితలను ఎంపిక చేసి "శ్రీ కొండగట్టు ఆంజనేయ వైభవము" పేరుతో కవితా సంకలనాన్ని ప్రచురించి, శుక్రవారం హనుమాన్ జయంతి రోజు కొండగట్టు దేవాలయంలో ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అయితే దీనిలో బొల్లారం జడ్పీ పాఠశాలకు చెందిన తెలుగు భాషోపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు రచించిన "అందరినీ కాపాడు", 9వ తరగతి విద్యార్థి దాసరి జగదీష్ రచించిన "శ్రీరామ దూతా! శిరసా నమామి" కవితలకు స్థానం దక్కింది. ఆంజనేయస్వామి కవితా సంకలనంలో బొల్లారం నుండి ఈ ఇద్దరి కవితలకు చోటు దొరకడం పట్ల పలువురు అభినందించారు.