మాయలమారి కరోనా మహా మాయావి కరోనా
మన తోటి వారి లోకి
పరకాయ ప్రవేశం చేసి
ఆనక మనతోనే యుద్ధంకు తయారీ
మనలో మనకే వైరం
సృష్టించే జగత్ కిలాడిది,
అందుకే మనమంతా కలిసి తిరగడం కొన్నాళ్లు మానేద్దాం
ఏకాకి గానే గడిపేద్దాం
ఒంటరి పోరాటం చేసి దీనిని మట్టు పెడదాం
మరికొన్నాళ్లు సహనంతో
అలక్ నిరంజనుల మవుదాం
అందుకు జగమంత కుటుంబం నాది అంటూ
ఆలపిస్తూ హాయిగా కాలం గడిపేదాం రండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి