పుట్టినరోజు.:-తాటి కోల పద్మావతి గుంటూరు.


 అదొక అనాధ ఆశ్రమం ‌ ఆ ఆశ్రమ ముందుకు కారు ఆగగానే కారులో నుంచి దిగారు రాఘవ రావు గారు విశాలాక్షి అమెరికా నుంచి వచ్చి నా కొడుకు కోడలు ఇద్దరు పిల్లలతో సహా.

ఆ ఆశ్రమాన్ని చూడగానే చక్కటి వాతావరణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. చుట్టూరా రకరకాల పూల మొక్కలు పండ్ల చెట్లు స్వాగతం పలుకుతూ చిరునవ్వులు కురిపిస్తున్నాయి. ఆశ్రమం యజమాని శంకరయ్య గారు ఆయన భార్య మాణిక్యాంబ ఎదురు వెళ్లి వారిని సాదరంగా ఆహ్వానించారు. అక్కడ ఉన్న పిల్లలంతా బిలబిలమంటూ బయటికి వచ్చారు. వాళ్ళని చూడగానే ఆ పిల్లల కళ్ళల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఎవరైనా వచ్చారంటే అది వారి కోసమేనని తెలుసు . వాళ్లకి బట్టలు స్వీట్స్ పండ్లు అన్ని పంచిపెడతారు. శంకరయ్య గారు ఆఫీస్ రూమ్ లోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. రాఘవరావు ఒకసారి భార్యాబిడ్డల్ని పరిచయం చేశారు. మా అబ్బాయి కృష్ణ అమెరికా నుంచి వచ్చాడు. నా మనవడి పుట్టినరోజు ఈసారి మీ ఆశ్రమంలో జరుపుకోవాలని వచ్చాము. అనగానే శంకరయ్య గారికి ఎక్కడలేని సంతోషం కలిగింది. మీ అంతటి వాళ్ళు మా ఆశ్రమానికి రావటం మాకు చాలా సంతోషం మీలాంటివారు వస్తుంటే నే మా ఆశ్రమం నడిచేది ఈ చిన్నారులందరికీ మంచి భోజనం దొరుకుతుంది అమెరికాలో ఉంటూ కూడా ఈ అనాధ పిల్లల మధ్య మీ మనవడు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మీ సంస్కారం మీ గొప్పతనం మా ఆశ్రమం పట్ల మీకున్న వాత్సల్యం అలాంటిది అంటూ నమస్కారం చేశారు. రాఘవ రావు గారు డ్రైవర్ ని పిలిచి కారులోని సామాన్లన్నీ ఏమని చెప్పారు. ఈ పూట అందరికీ సరే వంట చేయించండి కలిసి భోజనం చేద్దాం అన్నారు రు. హై క్లాస్ సొసైటీ వాళ్లంతా ఏ ఫైవ్ స్టార్ హోటళ్లలో ఫ్రెండ్స్ అందరిని పిలిచి పార్టీ చేసుకుంటున్నారు తిన్నంత తిని మిగిలింది డస్ట్ బిన్ లో పడేసి ఎంత డబ్బు ఖర్చు పెట్టామని గర్వంగా చెప్పుకుంటారు . అంత ఖరీదైన భోజనం వేస్ట్ చేయటం వల్ల ఏం కోల్పోతున్నారు వాళ్లకి తెలియదు ఒక పూట కడుపునిండా భోజనం దొరికితే చాలని ఎదురుచూసేవారు ఎంతో మంది ఉన్నారు అలా అనవసరంగా బదులు ఇలాంటి అనాధ పిల్లలకి పంచిపెడితే పుణ్యానికి పుణ్యం లభిస్తుంది మీరు చేసిన పని చాలా మంచిది అంటూ అభినందించారు. రాఘవ రావు గారు మనవడి చేత. కేకు కట్ చేయించారు పిల్లలంతా హ్యాపీ బర్తడే అంటూ కోరస్ గా పలికారు ఆరేళ్ల రిషిత్ పిల్లలందరినీ చూస్తుంటే చాలా ముచ్చటేసింది వాళ్ల కోసం తెచ్చిన బట్టలు స్వీట్స్ పండ్లు అందరికీ పంచిపెట్టాడు. వాటిని అందుకునే టప్పుడు ఆ చిన్నారుల కళ్ళల్లో వెన్నెల పూలు విరిసి నట్లున్నాయి. రంగు రంగుల బట్టల్లో అప్పుడే విరబూసిన గులాబీల ఉన్నారు. ఆశ్రమ మంతా కలిసి తిరిగారు ఈలోగా వంటలు పూర్తయినాయి అందరితో పాటు కలిసి సహబంతి భోజనాలు చేశారు ఆ పిల్లల అందరి మధ్య కూర్చున్నాడు కృష్ణ ఆశ్రమానికి ఒక డాక్టర్ వచ్చి ప్రతిరోజు పరీక్షించి వెళ్తాడు అలాగే చదువు చెప్పే టీచర్స్ కూడా వస్తారు. మీరు అమెరికాలో ఉంటూ ఇలాంటి సేవలు ఎందుకు చేయాలనుకుంటున్నారు కాస్త మీ గురించి వివరాలు చెప్పమన్నారు కొంతమంది ఆశ్రమం నడిపే పెద్దవారు. కృష్ణ ని చెప్పమన్నారు రాఘవ రావు గారు. నేను ఏదో గొప్పకోసం చెప్పడం లేదు మీడియా కోసం ఫోటోలు దిగి పేపరు ప్రకటనల కోసం అంతకన్నా కాదు నేను ఎక్కడ నుంచి వచ్చాను నాకు తెలుసు. ఇలాంటి ఆశ్రమంలోనే తల్లిదండ్రులు లేని అనాధలా బిక్కుబిక్కుమంటూ గడిపాను ఒక మహానుభావుడు నన్ను చూసి నాతో వస్తావా అన్నారు మంచి బట్టలు కొనిపెడతాను చదువు చెప్పి ఇస్తానన్నారు ఆయన ఎవరో కాదు ఈ మహానుభావుడే అంటూ రాఘవ రావు గారిని చూపించాడు ఆనాడు నన్ను ఆదరించి ఉండకపోతే ఇవాళ నేని స్థితికి ఎదిగి ఉండేవాడిని కాను ఆయనకి పిల్లలు లేకపోవడంతో నన్ను చేరదీయడం నా అదృష్టం కన్న కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమించి పెంచి పెద్ద చేసి మంచి చదువుతోపాటు సంస్కారాన్ని కూడా నేర్పించారు ఆయన ఆశీస్సులు నన్ను ఇంతవాడిని చేశాయి ఈ వాతావరణం మర్చిపోలేను నాలాగా ఎంతోమంది అనాధలు ఉంటారు వారి కోసం ఈ ఒక్కరోజయినా వారితో సరదాగా గడపాలని వచ్చాను ఈ ఆశ్రమానికి నా వంతు విరాళంగా రెండు లక్షలు చెక్కు అందిస్తున్నాను ఈ డబ్బు ఇక్కడ ఉన్న పిల్లల కోసం ఖర్చు చేయండి అంటూ రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేశాడు. మీలాంటి మంచి ఉన్నవారికి కి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. పది కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి మీలాంటివారు ఉంటేనే మా ఆశ్రమం కూడా ఆర్థికంగా నడప గలుగుతాం అన్నారు. రాఘవరావు గారి కళ్ళు సంతోష భాష్పాలు రాల్చారు.


కామెంట్‌లు