స్వేదము:- సత్యవాణి

 స్వేదము చిందించిన వానికి
గొప్ప విలువ మనుజులలో
స్వేదము చిందించని వానిని
సోమరిపోతను లోకము
స్వేదవిలువ తెలుసు కనుకె 
అంతో  యింతో యెంతో
ప్రతిఫలంగా కొంతైనా యిస్తుంది రైతుకు భూమాత
స్వేదము చిందించకేనటగదా
చెప్పరాని రోగాలు
బ్రతుకుతెరువుకే కాదు
బలమునకూ చిందించవలెనట స్వేదము
బంగారమువంటిమాటది 
పాటించిన మేలుగద