*వేటు!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1. వేటు పడింది!
     కండువా మారింది!
     తీర్థం అందింది!
     మరో గూడు పిలిచింది!
   ఇవి నేడు సామాన్యం!
2.నిన్ను నమ్మి, కాళ్ళు కడిగి,
   కన్యాదానం చేసినట్లు,
   ఏదో ఉద్ధరిస్తావని,
   వోటుదానం అనుగ్రహిస్తే,
   అసలు కొంగుముడి విప్పేసి,
 మరో కొంగుతో ముడేస్తున్నావే!
3.రాజు సరైనవాడు కాకుంటే,
 విభీషణుడు గూడు మారాడు!
 అతడెలావున్నా,కొసవరకు,
  కవచమై నిలిచాడు కర్ణుడు!
4.అక్కడికి! ఇక్కడికి!
   ఎందుకు? నీతిమాలిన చర్య!
  జనం లోకి రా! నిజనేతవైతే! 
  జనం నీరాజనం పడతారు!
  మరల పట్టం కడతారు!
  అగ్నిపరీక్షకు నిలబడ్డ,
            సీ(నే)తవవుతావు!
5.అధికారపక్షమా!
                 ప్రతిపక్షమా!
   ప్రజాప్రేమపక్షం,
  నాయకుడి జీవితం శుక్లపక్షం!
  ప్రజాభిప్రాయం పారిజాతం!
  అధికారం పాదాక్రాంతం!

కామెంట్‌లు