బాలబాలికలు బాగుగ వినుడీ
ఆరోగ్యమ్మే మహాభాగ్యము
వంటికి మేలు చేసే వాటిని
వద్దనకుండా తినవలెను
అటుకులు బెల్లం కొబ్బరివుండలు
ఆరోగ్యానికి గుళికలవి
విటమినులందున కూడివుండివున్నవి
ఎంతో శక్తిని అవియిచ్చు
గోధుమగవ్వలు జిలేబి చక్కీ
గొప్పగ ఖనిజములందుండు
మినపసున్నినీ మితముగ తినిన
ఇనుమగ మారును నీమేను
పూతరేకులు పుష్టిని యిచ్చును
తీయగ కమ్మగ తినరండీ
కజ్జికాయలు కరకజ్జాలలో
కలవుగ యేన్నో ప్రొటీనులు
ఇష్టంతోనవి తినుడు బాలలూ
నష్టంచెయవు అవిమీకూ
తేనెలో రొట్టిని అద్దుకు తినగను
వచ్చును శక్తి వెనువెంటే
ఎదిగెడి బాలలు ఎంచుకు తినవలె
ఏదుత్తమమో గమనించి
పిజ్జా బర్గర్ పీక్కు తినగను
పిసరంతైనా మేలేది
వంటికి మంచివి ఇంటివంటలూ
ఈ విషయం మీరు నమ్మండీ
బాలగేయం:- సత్యవాణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి