వాన (బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
మెరుపుల మేఘం వచ్చింది
ఉరుముల ద్వనులినుకుంటు
ఆకాశమం చుట్టు  తిరిగింది
వసుధ తల్లిని చూసింది !!

వాన జల్లుతో వచ్చింది
జడివానై కురిసింది
బీడు భూమి తడిసింది
రైతు చూసి మురిసాడు !!

పొద్దున నిద్ర లేసాడు
పొలం వద్దకు వెళ్ళాడు
సాగుభూమికి మొక్కాడు
జోడెడ్ల నాగలి కట్టాడు !!

దుక్కి నంతా దున్నాడు
విత్తనాలు వేసినారు
చేను వేపుగా ఎదిగింది
పంటలు బాగా పండాయి !!