పుష్టికరమైన ఆహారము (బాల గేయము)-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
నువ్వుల ముద్దలు 
పల్లీల ముద్దలు
ప్యాలాల ముద్దలు
ఆరోగ్యానికి మేలు

 పెసరి  మొలకలు
 శనగ మొలకలు
 అల్పాహారాలు
 ఇచ్చు ఆరోగ్యాలు

పాలకూర, గంగవాయిలు
మెంతికూర,  కొత్తిమీరలు
చుక్కకూర, పూదీనాలు 
తరచుగా తిన్నా మేలు 

అంతట తిరిగే కరోనా 
మనదరికి రావద్దంటే 
ఆరోగ్యంగా ఉండాలి
కరోనా నే తరమాలి.