సత్వగుణం(ఇష్టపది)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
సజ్జనులతో చెలిమి సాత్వికతను పెంచును
సువిచారములు గల్గు సువిశాలత బెరుగును

సాధుతత్వము కల్గి స్వాధ్యాయ నిష్ఠమై
సమదృష్టితో నడుచు సానుకూల ధోరణి

పెరిగి,నైతికవిలువ పేరు నలుమూలలను
చేరి,జీవనసరళి చేయూత బడసినను

లోకాన నిం

డుగా లోకోత్తర గుణమై
వెలుగును గాదె కనిన వేల్పుల సమత్వమై.