దత్తపదులు:-బెజుగాం శ్రీజ -ట్రిపుల్ ఐటీ బాసర-గుర్రాలగొంది జిల్లా: సిద్దిపేట

 1ఆ.వె.
 *చెవు* లువినబడకనుపోగ చింతకలుగు
*నోటి* సైగలవలనను మాటపలుకు
*కనుల* తోడనుజూసియు జనులుయంత
*ముక్కు* ద్వారగాలిని పీల్చు నెక్కువగను
2.తే.గీ.
 *అరిసె* *గారె* *పూరి* *వడ* లె యన్నిరకపు
అప్పలన్నియుజేసుక హాయిగాను
తినగ రుచికరముగనుండ తృప్తికలుగ
సంతసంబునుపొందును మంతనమున
3.ఆ.వె.
*కల* లు కనుచు రైతు  కాంక్షించి భూమిని
దున్న *గల* డు తాను దుక్కులన్ని
రా *వల* సిన నీరు రాలేక పోయిన
పంట నెండ *తల* ను  
బాదుకొనియె