స్వయంవరం: --పద్మావతి గుంటూరు.

 భార్గవ ఆఫీస్ కి వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో అమ్మానాన్నల్ని చూడాలని ఇంటికి వచ్చాడు.
ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటావా అంటూ తల్లి రెండు ఫోటోలు తెచ్చి కొడుకు ముందర పెట్టింది.ఈ రెండిట్లో నీకు ఎవరు నచ్చారు చెప్పమంది.భార్గవ ముందు శ్రావ్య అనే అమ్మాయి ఫోటో చూశాడు అతనికి ఆమె బాగా నచ్చింది.వెంటనే చూపులకు ఏర్పాటు చేయమన్నాడు.శ్రావ్య తల్లిదండ్రులు భార్గవ్ వాళ్ళని రాగానే కాళ్లకు నీళ్లు అందించి మంచి మర్యాద చేశారు.కాఫీ కప్పు అందుకుంటూనే భార్గవ శ్రావ్య ని చూశాడు. చక్కని ముఖం అందంగా ఉంది .ఆకుపచ్చని చీర కనకాంబరాలు పెట్టుకొని చేతినిండా మట్టి గాజులతో మెడలో గొలుసు చెవులకు జూకాలు అచ్చం కుందనపు బొమ్మలా ఉంది.భార్గవ కు శ్రావ్య చాలా బాగా నచ్చింది ఈ విషయం తల్లితో చెప్పాడు.శ్రావ్య ను పక్కకి పిలిచి భార్గవ ఆమె అభిప్రాయాలను తెలుసుకున్నాడు ఎంతో నెమ్మదిగా మంచి మర్యాదగా మాట్లాడింది శ్రావ్య.భార్గవ్ తల్లిదండ్రులను తన తల్లిదండ్రుల లాగానే చూసుకుంటానని మాట ఇచ్చింది.శ్రావ్య తల్లిదండ్రులు అడిగినంత కట్నం ఇచ్చుకో లేమన్నారు పెళ్లి కూడా సింపుల్ గా చేస్తామన్నారు.శ్రావ్య కుటుంబం ఉన్నత స్థితిలో లేదని భార్గవ్ తల్లికి ఆ సంబంధం నచ్చలేదు.ఇంటికి వెళ్ళాక ఏ సంగతి చెబుతామన్నారు.మరునాడు పెళ్లిళ్ల పేరయ్య ఇంకో సంబంధం చెప్పటంతో భార్గవ తల్లి సంబంధం చూడటానికి వెళ్లారు.వాళ్లు బాగా ఉన్నవాళ్లు కావడంతో భార్గవ తల్లికి ఆ పిల్ల పెట్టుకోండి పెట్టుకుంది పెట్టుకుంది పెట్టుకొని ఏంటి పెట్టుకుంది పెట్టుకోండి శైలి తో భార్నగవ్ మాట్లాడాడ పెట్టుకుందిచ్చింది.అడిగినంత కానుకలు ఇస్తామన్నారు.భార్గవ కు ఆ పిల్ల మీద అంతా శ్రద్ధ చూపెట్టలేదు.పక్క గా వెళ్లి ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.శైలు ని చూస్తుంటే పెళ్ళికూతురిలా పెళ్ళికూతురిలా అనిపించలేదు.జీన్స్ ప్యాంటు భుజాల వరకు చేతులున్న బ్లౌజు ఒక చేతికి గోల్డ్ బ్యాంగిల్స్ మరో చేతికి వాచీ మెడలో చైన్ చెవులకు వేలాడే ఫ్యాన్సీ జూకాలు పెట్టుకుంది.శైలు ని పక్కకు తీసుకువెళ్లి భార్గవ్ ఆమె అభిప్రాయాలను తెలుసుకున్నాడు.శైలు మాటలు భార్గవ్ కె నచ్చలేదు అత్తమామల్ని ఇంటికి రాకూడదు తన తల్లి తల్లిదండ్రుల్ని మాత్రం ఇంటికి వచ్చి పోతూ ఉంటారు ‌పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాలని ఉంది ‌.
భర్త తన చెప్పు చేతల్లోనే ఉండాలని అంది.
అది అది భార్గవ్ కి నచ్చలేదు ఈ విషయం తల్లిదండ్రులతో చెప్పాడు.
నాకు తల్లికి వాళ్ళ ఆస్తిపాస్తులు మీద ఆశగా ఉంది పెళ్లయ్యాక మార్పు వస్తుంది లే అనుకుంది.
భార్గవ్ మాత్రం ఈ పెళ్లికి ససేమిరా అన్నాడు.
అత్తమామల్ని బాగా చూసుకునే కోడలు కావాలా ఆస్తిపాస్తులు తెచ్చే కోడలు కావాలా మీరే నిర్ణయించుకో మన్నాడు.
బాగా ఆలోచించి తమ ని ప్రేమగా చూసుకునే కోడలు కావాలని శ్రావ్య అనే కోడలుగా చేసుకోవటానికి నిర్ణయించుకున్నారు.
భార్గవి పెళ్లి శ్రావ్య తో జరిగిపోయింది.
మంచి కోడలు వచ్చినందుకు అందరికీ సంతోషంగా ఉంది భార్గవ ఆలోచించి అడుగు ముందుకు వేసి మంచి నిర్ణయం తీసుకున్నాడు.