కప్పలు కప్పలు బెకబెక కప్పలుకప్పలు కప్పలు బెకబెక కప్పలు!!చిటపట చినుకులు రాలినకొద్దీజలజల నీళ్ళు పారినకొద్దీచకచక కప్పలు నడిచాయ్ ముందుకుకప్పలు కప్పలు బెకబెక కప్పలుకప్పలు కప్పలు బెకబెక కప్పలు!!కళకళలాడే ముఖాలతోనీజిలిబిలి పలుకుల మాటలతోనీపకపక నవ్వుతొ నడిచాయ్ ముందుకుకప్పలు కప్పలు బెకబెక కప్పలుకప్పలు కప్పలు బెకబెక కప్పలు!!తికమక తింగరి పాటలుమానీమకతిక నంగిరి మాటలుమానీదబదబ కప్పలు నడిచాయ్ ముందుకుకప్పలు కప్పలు బెకబెక కప్పలుకప్పలు కప్పలు బెకబెక కప్పలు!!మిలమిల కన్నులు మెరుస్తుండగామిసమిస రంగులు కాంతులీనగారకరకముల కప్పలు నడిచాయ్ ముందుకుకప్పలు కప్పలు బెకబెక కప్పలుకప్పలు కప్పలు బెకబెక కప్పలు!!చరచర ముందుకు నడిచిన కప్పలుతళతళలాడే పలకలు తీసుకునిరంగురంగుల పుస్తకాలు తీసుకునిటకటక కప్పలు చేరెను బడిలోకప్పలు కప్పలు బెకబెక కప్పలుకప్పలు కప్పలు బెకబెక కప్పలు!!అప్పటినుండి బడిలో వినిపించెనుబెకబెక బెకబెక బెకబెకలుఅందుకె ఆబడి బెకబెక బడికప్పలు కప్పలు బెకబెక కప్పలుకప్పలు కప్పలు బెకబెక కప్పలు!!!
*బెకబెక బడి*:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి