సకారాత్మకం...రచన అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం ఎప్పుడు సకారాత్మకం గా అంటే పాజిటివ్ గానే ఆలోచించాలి. మనమంచి భావాలు  ఈవిశాలవిశ్వంలో వ్యాపిస్తాయి. అందుకే చప్పట్లు చరుస్తూ భజనలు చేస్తే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది అని విదేశీ
 శాస్త్రవేత్తలు తమ ప్ర యోగాలద్వారా  నిరూపించారు. యధ్భావంతద్భవతి.తథాస్తు దేవతలుంటారని పెద్దలు హెచ్చరించారు.
ఒకచిన్న కథచెప్పుకుందామా?
ఒకరైతు సంతకెళ్లి తిరిగి వస్తూఎండకితాళలేక ఒకపెద్ద చెట్టుకింద పడుకొన్నాడు.చల్లనిగాలికిఆరావిచెట్టు ఆకులు కదులుతున్నాయి. రావిచెట్టు మానసిక రోగాలను పోగొడుతుంది అని సైన్స్ కూడా నిరూపిస్తోంది. కథలోని ఈచెట్టుకి ఒకప్రత్యేక శక్తి ఉంది. మనసులో ఏది తలుచుకుంటే అది జరుగుతుంది. "అబ్బా!దాహంగాఉంది.నీటి చెలమ దగ్గర లోఉందేమో"అనుకుంటుండగాకొంచెందూరంలో చెలమకనపడింది."అబ్బ!కొబ్బరి నీరులా తీయగా చల్లగా ఉంది "అనుకుంటూ కడుపు నిండా తాగి తనదగ్గరున్న పెద్దరాగిచెంబునిండా పట్టుకుని చెట్టుకింద పడుకొన్నా డు. ఇంతలో చిన్న చిన్న రావివిత్తులు పైన పడసాగాయి. "ఇవి వెండి బంగారు నాణాలు గా మారితేబాగుండు"అనుకున్నాడో లేదో విచిత్రంగా నాణాలు గలగలలాడాయి.అక్కడ ఉన్న విత్తులన్నీ ఏరి మూటకట్టి ఆలోచనలో పడ్డాడు. "ఈవిత్తులను నాపల్లె బాటకు ఇరువైపుల నాటుతాను.దీని మహిమ చెప్పితే దురాశతో అంతా  మొక్కలను పీకేసి తమపొలం ఇంటి లో  నాటుకోవచ్చు. నేను కూడా  నాచేతిలో ఉన్న వెండి  బంగారు నాణాలు తో తృప్తి పడుతాను.లేకుంటే  నాసంతానం సోంబేరులుగాతయారైతారు".ఇంతలో ఇద్దరు బాటసారులు వచ్చి దాహంగాఉంది అనగానే  తనదగ్గరున్న  నీరు ఇచ్చి  బోళాగా ఆచెట్టుమహత్యం చెప్పాడు."ఏవీ చూపు"ఆటక్కరివాళ్లుఅడగంగానే చేతిలో పెట్టాడు.ఆశ్చర్యం!అవి రావి విత్తులైనాయి.వారు  అతనిని గేలిచేస్తూ పిచ్చివానిగా భావించి తమదోవనతాము వెళ్ళారు.రైతుకి అశరీరవాణి వినపడినది. "నీవు బోళావాడివి. సకారాత్మకం గా ఆలోచించి  ఇతరుల మేలు బాగు కోరుతావు.అందుకే నీకు నాణాలు ఇచ్చాను.వారు దుష్టులు.అందుకే వారి నుంచి  నిన్ను కాపాడాను."రైతు  ఆచెట్టు కి దండాలు పెడుతూ దైవప్రార్థన చేస్తూ తన ఊరి బాట పట్టాడు.అందరం ఈకరోనాకాలంలో  అంతామంచి జరుగుతుంది సర్వేజనా:సుఖినో భవంతు  అని ధైర్యం  పాజిటివ్ గా ఉంటూ వైద్యసలహాలు పాటించాలి.