పూల కుండీ -బాల గేయం (మణిపూసలు ):--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

పూల కుండి కళ ఇంటికి 
ఆహ్లాదం కద కంటికి 
పెరటి చెట్టు పూల తోను 
అందము మరి  వరండాకి!

కొన్ని పూలు గుత్తి కోయి 
కుండీలో నీరు పోయి 
గుత్తి ఉంచి చూడాలిక 
మనసులోన ఎంత హాయి!

ఉప్పు నీటి లో ఉంచిన 
ఎక్కువ సేపు తాజాన 
పూలు నవ్వుతు ఉంటాయి 
అతిధులకే  స్వాగతమన !